Gopichand-Prabhas: టాలీవుడ్ హీరోలంతా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కేస్తుంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఇంకా బ్యాచిలర్ లైఫ్‌ను మెయింటైన్ చేస్తున్నారు. దాదాపు పదిహేనేళ్ల నుంచి ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. కానీ నాలుగు పదుల వయసొచ్చినా పెళ్లిపై ఆయన మక్కువ చూపడం లేదు. ఇప్పటి వరకు తన పెళ్లిపై ఎన్నో రకాల వార్తలు వచ్చినా.. వాటిపై ప్రభాస్ ఎన్నడూ రియాక్ట్ కాలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన బెస్ట్ ఫ్రెండ్, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ షాకింగ్ కామెంట్ చేశాడు. ప్రస్తుం గోపీచంద్ తనా రాబోయే చిత్రం భీమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ఏ. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.
ఓ పవర్ఫుల్ పోలీస్ కథకు ఫాంటసీ ఎలిమెంట్లు జోడించి భీమా చిత్రాన్ని రూపొంచారు. మార్చి 8న ఈ చిత్రం విడుదల కాబోతోంది. భీమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ప్రముఖ పాపులర్ టాక్ షో ఆలీతో సరదాగా లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెషనల్ తో పాటు పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నారు. భీమా రెగ్యులర్ పోలీస్ స్టోరీ కాదని.. చాలా కొత్త ఉంటుందని.. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందని గోపీచంద్ తెలిపారు.
ఈ క్రమంలోనే ఆలీ మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రభాస్‌కు మీరు బెస్ట్ ఫ్రెండ్ కదా.. ఆయన పెళ్లెప్పుడంటూ ప్రశ్నించాడు. అందుకు గోపీచంద్ చాలా సింపుల్ గా నాకు తెలియదంటూ ఆన్సర్ ఇచ్చారు. `వర్షం సినిమా చేయడానికి ముందే మా మధ్య పరిచయం ఉంది. వర్షంతో మా స్నేహం మరింత బలపడింది. ఇద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తాం` అంటూ గోపీచంద్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ప్రభాస్ పెళ్లి అప్డేట్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ను గోపీచంద్ కామెంట్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే ప్రభాస్ కు బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి ఆయన పెళ్లి గురించి తెలియదని చెప్పడం కరెక్ట్ కాదంటూ మన మ్యాచో హీరోకు డార్లింగ్ ఫ్యాన్స్ చురకలు వేస్తున్నారు. కనీసం త్వరలో అని చెప్పినా సంతోష పడేవాళ్లమని అభిప్రాయపడుతున్నారు.