KGF 2: “కేజిఎఫ్” సినిమాతో… హీరో యాష్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. ఈ సినిమా రాకముందు వరకు…యాష్ క్రేజ్ కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అన్నట్టు ఉండేది. కానీ “కేజిఎఫ్”తో ఓవర్ నైట్ లోనే దేశవిదేశాలలో యాష్ కి తిరుగులేని మాస్ క్రేజ్ ఏర్పడింది. తెలుగులో కూడా కేజిఎఫ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో యాష్ కి సపరేట్ మార్కెట్ క్రియేట్ కావడం తెలిసింది. అందువల్లే “కేజిఎఫ్ 2” సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది.
ఇదిలా ఉంటే సినిమా ఏప్రిల్ 14 వ తారీకు విడుదల అవుతున్న నేపథ్యంలో… రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న హీరో యాష్.. తెలుగు సినిమా ప్రేక్షకుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేజిఎఫ్ 2” సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలో యాష్ మాట్లాడుతూ… ఖాళీ చేతులతో కేజిఎఫ్ సినిమా కి వెల్కమ్ చెప్పిన తెలుగు ప్రేక్షకులు “కేజిఎఫ్ 2” సినిమాని భారీ ఎత్తున నెక్స్ట్ లెవెల్ లో కి తీసుకెళ్లారు. “కేజిఎఫ్ 2” సీక్వెల్ కి భారీ ఎత్తున తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా సినిమా మేకర్స్ కూడా బాగా కష్ట పడ్డారు.
గ్యారెంటీగా సినిమాపై పెట్టుకుని అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా “కేజిఎఫ్ 2” ఉంటుంది అంటూ యాష్ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇక నార్త్ లో సినిమాకి మంచి రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం టెక్నీషియన్లు. దానికంటే ముందు రాజమౌళి గారు. ఆయన.. తెరకెక్కించిన సినిమాలు వల్ల ఇప్పుడు నార్త్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది అని యాష్ తెలిపాడు. ఖచ్చితంగా అందరి అంచనాలు KGF 2 అందుకోవడం జరుగుతుందని యాష్ చెప్పుకొచ్చాడు.