“Film that gave me a life”: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందరికీ సుపరిచితురాలే. పొడుగు కాళ్ళ సుందరి అయినా రకుల్ ప్రీత్ సింగ్ పాపులారిటీతో సంబంధం లేకుండా.. స్క్రిప్ట్ బాగుంటే ఎవరితోనైనా నటించే హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో.. అలరిస్తూ మంచి సక్సెస్ కెరియర్ తో కొనసాగుతూ ఉంది. “కెరటం” సినిమాతో 2011వ సంవత్సరంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ భామ.. 2013లో “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” సినిమాతో మంచి బ్రేక్ అందుకోవటం జరిగింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించారు. తెలుగులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే.
2013 నవంబర్ 29వ తారీకు విడుదలైన ఈ సినిమా నేటికీ 10 సంవత్సరాలు కావటంతో… తన కెరియర్ లో “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” సినిమా చాలా కీలకమని రకుల్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని అంతగా నన్ను ఆదరించారు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలియజేసింది. ఇదే సమయంలో హీరో సందీప్ కిషన్.. అదేవిధంగా డైరెక్టర్ మెర్లపాక గాంధీకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” సినిమా విజయం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి.
గోపీచంద్ తో లౌక్యం, రామ్ పోతినేని తో పండగ చేసుకో, అల్లు అర్జున్ తో సరైనోడు, రామ్ చరణ్ తో ధ్రువ, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం, మహేష్ బాబుతో స్పైడర్.. వంటి సినిమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ విజయవంతమైన కెరియర్ తో రకుల్ దూసుకుపోతుంది. మళ్లీ తెలుగులో సినిమాలు చేయడానికి కూడా రకుల్ ఎదురు చూస్తున్నట్లు కొద్ది నెలల క్రితం రెండు స్క్రిప్ట్ కూడా విన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మాత్రం బాలీవుడ్ పైన రకుల్ ప్రీత్ సింగ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!