Chiru Raviteja: మెగాస్టార్ చిరంజీవి తో మాస్ మహారాజా రవితేజ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి “అన్నయ్య” సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత “శంకర్ దాదా జిందాబాద్” లో అలా మెరిసి వెళ్ళిపోయాడు రవితేజ. కాక మళ్లీ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 154వ సినిమాలో రవితేజ నటించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాకి రవితేజ అ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్.
దాదాపు పది కోట్ల రెమ్యూనరేషన్ చిరంజీవి తో చేయబోయే సినిమాకి రవితేజ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో చేయబోయే సినిమాకు సంబంధించి సరికొత్త షెడ్యూల్ లో రవితేజ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. దాదాపు ఏప్రిల్ నెలలోనే చాలా టైం కలిసి వస్తున్న తరుణంలో రవితేజ కి సంబంధించిన సన్నివేశాలు… షూట్ చేసే ఆలోచనలో బాబీ ఉన్నట్లు టాక్.
ఇద్దరు కూడా మాస్ నేపథ్యం కలిగిన క్రేజ్ ఉన్న హీరోలు కావటంతో… ఈ సినిమా మా అది కారిక ప్రకటన రాగానే మాస్ ప్రేక్షకులు .. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పైగా రవితేజకి చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం కావటంతో.. రవితేజ అభిమానులు మరింత సంతోషంగా తాజా వార్త పై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా ఈ సమ్మర్ లో విడుదల కానున్న తరుణంలో ..త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిరంజీవి, చరణ్ జాయిన్ అవ్వడానికి రెడీ అవ్వుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!