Intinti Gruhalakshmi: ప్రేమ్ తీసుకు వచ్చిన డబ్బులు శృతిని ఖర్చు పెట్టమని ఇస్తాడు.. ప్రేమ్ ఇచ్చిన తొమ్మిది వేలలో 3000 ఇంటి అద్దెకి.. మరో మూడు వేలు సరుకులు తీసుకురమ్మని ఇస్తుంది.. మిగతా 3000 ఏదైనా అత్యవసరం వస్తే పక్కన పెట్టి ఉంచుతాను అని అంటుంది.. ప్రేమ్ సరుకులు తీసుకురావడానికి బజార్ కి వెళ్తాడు..!
బజారుకి వెళ్లిన ప్రేమ్ సరుకులు తీసుకొస్తాడు. పనిలో పనిగా శృతికి ఒక నాలుగు చీరలు తీసుకొస్తాడు.. సగం ధరకే చీరలు అనడంతో నీకు తీసుకువచ్చా.. నీ దగ్గర ఉన్న మూడు వేలు తో అద్దె కడతాను అంటాడు. ఇక శృతి ఇంట్లోకి వెళ్లి నీ కోసం షర్టు కొన్నాను. నువ్వు బయటికి వెళ్ళాలి . పెద్ద పెద్ద వాళ్లతో ఈవెంట్స్ గురించి మాట్లాడాలి. అందుకోసం కూడా బట్టలు తీసుకున్నాను అని అనగానే.. అయిపోయింది.. సరిపోయింది ఇద్దరం కలిసి ఉన్న డబ్బులతో సరుకులతో పాటు ఇద్దరికీ బట్టలు తీసుకున్నాను.. ఎలా కట్టాలో అద్దె కట్టాలో ఏంటో అని ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా.. వాళ్ళ అత్తయ్య మాధవి వస్తుంది .అంతలో ప్రేమ్ ఫోన్ కి లాస్య ఫోన్ నుంచి కాల్ చేస్తుంది. ఎందుకు చేస్తుందో ఏంటో లిఫ్ట్ చేయమని మాధవి అంటుంది.. ఒరేయ్ నేను రా అని అనగానే దివ్య ఎలా ఉన్నావ్ ఏంటి అని అడుగుతారు. నువ్వు లేవని బెంగ పెట్టుకుని అన్నం కూడా తినడం లేదు . అమ్మ చాలా మారిపోయింది. నీకోసం నేను తినకుండా ఉన్నా కూడా కనీసం నన్ను పట్టించుకోవడం లేదు అని అంటుంది. అమ్మ ను ఏమి అనకు.. జాగ్రత్తగా ఉండు అమ్మను చూసుకో.. ముందు నువ్వు ఏమైనా తిను అని అంటాడు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను వచ్చి నిన్ను కలుస్తాను అని దివ్య ఉంటుంది. ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నేను వచ్చి నిన్ను కలుస్తాను. నువ్వు తిను అని అంటాడు. నువ్వు తినకపోతే నా మీద ఒట్టు అని ఫోన్ కట్ చేస్తాడు. లాస్య దివ్య తో నేను చెప్పినట్టుగానే మీ అన్నయ్య తో మాట్లాడాను కదా ఇప్పుడు వెళ్లి భోజనం చేద్దాం అని అంటుంది.
రాములమ్మ తులసిని అర్జెంటుగా 3000 కావాలి అని అడుగుతుంది. ఎందుకు నీకు అంత డబ్బులు అడగగా.. మా అక్క కొడుకు ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకువస్తాడు. వాళ్ళని విడిగా కాపురం పెట్టడానికి అద్దె ఇల్లు తీసుకున్నాను . ఆ అద్దె కట్టడానికి 3000 కావాలి అని అంటుంది. సరే అని తులసి ఇస్తుంది. దివ్య వచ్చి రాములమ్మ అన్నం పెట్టు అని అంటుంది. తులసి వడ్డించ బోతుండగా.. నా మీద అంత ప్రేమ మీరు ఎవరు చూపించకండి.. అంత అవసరం లేదు. రాములమ్మ నువ్వు వచ్చి అన్నం పెట్టు అని అంటుంది. ఇక దివ్య మాటలు విన్న తులసి మనసు నొచ్చుకుంటుంది. దివ్య ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటో తులసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. లాస్య అడ్డుపడుతుంది. తులసి మధ్య లాస్య మధ్య ఎలాంటి రచ్చ జరుగుతుందో తెలుసుకుందాం..