హీరోయిన్ జ్యోతికకు కార్తీ వరసకు మరిది అవుతాడు. అయితే వెండితెరపై మాత్రం తమ్ముడిగా నటించబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. దృశ్యం, పాపనాశం సహా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్. జ్యోతిక, కార్తీలతో ఓ సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజుల ముందు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వదిన మరిది సినిమాలో మాత్రం అక్క, తమ్ముడు పాత్రల్లో నటిస్తారట. ప్రస్తుతం కార్తి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో సినిమాతో పాటు `ఖైది` అనే సినిమాలో కూడా కార్తి నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత జీతూ జోసెఫ్ సినిమా ప్రారంభం అవుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
previous post
next post