హీరో సూర్య, కె.వి.ఆనంద్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాప్పాన్’. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమా సమాంతరంగా విడుదల కానుంది. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ ప్రధాని పాత్రలో కనిపించబోతున్నారు. ప్రధానిని కాపాడే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూర్య నటిస్తున్నారు. సయేషా సైగల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఆర్య కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా పాటను జావా ద్వీపంలో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. వీడొక్కడే, బ్రదర్స్ చిత్రాల తర్వాత సూర్య, కె.వి.ఆనంద్ కాంబినేషన్లో రానున్న సినిమా కావడంతో ‘కాప్పాన్’పై భారీ అంచనాలున్నాయి. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!