లోకనాయకుడు కమల్ హాసన్, సెస్సేషన్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా భారతీయుడు 2.. భారతీయుడు సినిమాకు సక్వెల్గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయాలు, రాజకీయ నాయకుల అవినీతి బేస్ చేసుకొని దర్శకుడు శంకర్ కథని సిద్దం చేశాడనట…ఇక ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కమల్ రాజకీయ జీవితానికి ఉపయోగ పడేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఈ నెల 18 నుంచి కేరళలో పొల్లాచ్చి లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది..ఇక్కడే కమల్‌హాసన్‌తో పాటు మొయిన్ క్యారెక్టర్స్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. అ తరువాత షెడ్యూల్‌ని ఉక్రెయిన్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కమల్ పాత్ర ప్రయోగాత్మకంగా ఉండనుందట. యువకుడు, వృద్ధుడు రెండు పాత్రలలో కమల్ కనిపించనున్నట్టు తెలుస్తుంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కమల్‌కు జోడీగా సినీయర్ బ్యూటీ కాజల్ నటింస్తోంది. కాజల్ లుక్ కూడా డిఫరెంట్‌గానే ఉంటదని సమాచారం.అయితే శంకర్ తన ప్రతి సినిమాకు చాలా టైం తీసుకున్నాడ . అందుకే ఆయన సినిమాలు థియేటర్స్‌లోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఇటీవలే వచ్చిన రోబో 2.ఓ సినిమా దాదాపు మూడు సంవత్సరాలకు పైగానే షూటింగ్ జరుపుకుంది. 2. ఓ సూపర్ హిట్ కావడంతో అదే జోష్‌తో భారతీయుడు సినిమాని స్టార్ట్ చేశాడు శంకర్. అయితే ఈ సినిమాకు ఎక్కువ టైం తీసుకోకుండా నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేసి ఈ సమ్మర్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇక భారతీయుడు 2 తరువాత కమల్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. మరి ఈ మూవీ కమల్ పోలిటికల్ ఎంట్రీక ఎంతవరకు ఉపయోగ పడుతుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!