RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి నెలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయి అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఫస్ట్ టైం ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకి తెలుగులో మాత్రమే కాదు వివిధ భాషలలో మిగతా దేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరికిద్దరూ పోటీపడి మరీ నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా అన్నదమ్ములు మాదిరిగా ఉన్నారని కామెంట్లు చేశారు. దాదాపు మూడు సంవత్సరాల పడిన కష్టానికి మంచి ఫలితం రావడంతో సక్సెస్ సంబరాలలో కూడా ఇద్దరు మంచి ఎంజాయ్ చేశారు.
ఒకరిని మరొకరు పొగుడుకుంటూ చాలా బ్యాలెన్స్ వాతావరణం అభిమానుల మధ్య క్రియేట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే సినిమాలో ఎన్టీఆర్ పాత్ర “కొమరం భీమ్” .. మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అని అందరికీ తెలుసు. ఆ పాత్ర గురించి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చరణ్ కూడా చాలా కష్టతరమైన పాత్ర, తారక్ చాలా బాగా నటించాడని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా “కొమరం భీమూడో” సాంగ్ లో ఎన్టీఆర్ పేస్ లో చూపించిన హావభావాలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. కేవలం ఆ పాట కోసం సినిమాని మళ్లీ మళ్లీ చూడటానికి థియేటర్ కి వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే “RRR” కి సంబంధించి చాలా వీడియో సాంగ్స్ ఇటీవల సినిమా యూనిట్ ఒక్కొక్కటి రిలీజ్ చేయటం మనం చూశాం. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు “కొమరం భీమూడో” సాంగ్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పాట కోసం ఎదురుచూస్తున్న వారికి సినిమా యూనిట్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. మే ఆరో తారీకు సాయంత్రం నాలుగు గంటలకు.. “కొమరం భీమూడో” వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. “ఆర్ఆర్ఆర్” లో అని పాటలు ఒక ఎత్తు అయితే ఈ “కొమరం భీమూడో” సాంగ్ మరొక ఎత్తు. ఫ్యాన్స్ ని మాత్రమే కాదు…కామన్ ఆడియెన్స్ ని సైతం ఆక్కటుకోవడం జరిగింది.