Lavanya Tripathi: అందాల రాక్షసి చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. అనంతరం అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోయింది. ఇక ఆమె అందం అభినయంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన సమయంలో వరుణ్ తో ప్రేమలో పడింది.
గత కొన్నేళ్లుగా వీరి ప్రేమాయణాన్ని మూడో కంటికి కూడా తెలియకుండా మేనేజ్ చేసిన ఈ జంట గత ఏడాది పెద్దల అంగీకారంతో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మెగా ఇంటికి కోడలైన లావణ్య త్రిపాఠి సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.
ఇక లావణ్య పెళ్లికి ముందు నటించిన చేసిన ” మిస్ పర్ఫెక్ట్ ” అనే వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన భర్త వరుణ్‌తేజ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది లావణ్య. వరుణ్, నువ్వు పెళ్లికి ముందు కలిసి నటించారు?
మరి పెళ్లి తర్వాత ఎప్పుడు నటిస్తారు? అని ప్రేక్షకుల ప్రశ్నలకి లావణ్య సమాధానమిస్తూ..” నేను దానికోసమే పెళ్లయిన నాటి నుంచి ఎదురుచూస్తున్నా. ప్రాముఖ్యత ఉన్న కథ దొరికితే తప్పకుండా నటిస్తా ” అంటూ సమాధానమిచ్చింది లావణ్య. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె వ్యాఖ్యలను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!