Ram Charan: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగారజ్(Lokesh Kanagaraj) వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ లు సాధించడం తెలిసిందే. విజయ్(Vijay) తో “మాస్టర్” ఆ తర్వాత లేటెస్ట్ గా కమల్ హాసన్(Kamal Hassan) తో “విక్రమ్”(Vikram) సినిమాలతో రెండు అదిరిపోయే విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. “విక్రమ్” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాదు.. తమిళ ఇండస్ట్రీలో “బాహుబలి 2″(Bahubali 2) రికార్డులను కూడా బ్రేక్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో కమలహాసన్ కి మంచి బ్రేక్ వచ్చినట్లయింది. దీంతో డైరెక్టర్ లోకేష్ కనగారజ్ పేరు దేశవ్యాప్తంగా మారుమొగుతుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే “మాస్టర్”(Master) సినిమా చేస్తున్న సమయంలోనే.. చరణ్(Ram Charan) తో సినిమా చేస్తున్నట్లు లోకేష్ కనగారజ్ తెలపటం తెలిసిందే. ఆ టైంలో కమలహాసన్ సినిమా విక్రమ్ కంప్లీట్ అయ్యాక చెర్రీ సినిమా స్టార్ట్ అవుతుందని తెలియజేశారు. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే..లోకేష్ కనగారజ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చరణ్ సినిమా పనులు స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ బడా నిర్మాతలకు వినిపించే పనిలో లోకేష్ కనగారజ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం మీ సినిమా షూటింగ్ సరదాగా సాగుతోంది. శంకర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ కనగారజ్ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. శంకర్ సినిమా కంప్లీట్ అయ్యాకే చెర్రీ ..లోకేష్ కనగారజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇప్పుడు టైం దొరకడంతో చెర్రీ స్క్రిప్ట్ పై లోకేష్ కనగారజ్ ఫోకస్ పెట్టినట్లు.. బడా నిర్మాతల వేటలో ఉన్నట్లు తమిళ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!