NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 14 2024 Episode 312: ఆత్మ రక్షణ కోసం కర్ర పట్టుకున్నానుని రుక్మిణి అరెస్టు చేయించిన శ్యామ్..

Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights

Madhuranagarilo March 14 2024 Episode 312: లేదు సార్ అతను అబద్ధం చెప్తున్నాడు నన్ను చంపేస్తాడు సార్ నన్ను కాపాడండి అని రుక్మిణి అంటుంది. కాదు సార్ నిజంగానే తను నా భార్య అందుకే కొట్టాను అని శ్యామ్ అంటాడు. మీరు ఏం చెప్పుకోవాలన్నా పోలీస్ స్టేషన్కు వచ్చి చెప్పుకోండి అని వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు కానిస్టేబుల్. కట్ చేస్తే, ఏంటయ్యా నీ ప్రాబ్లం నీ భార్యని ఎందుకు కొడుతున్నావ్ అని ఎస్సై శ్యామ్ ని అడుగుతాడు. సార్ నేను కొట్టడం లేదు సార్ ఆత్మరక్షణ కోసం కర్ర పట్టుకున్నాను అంతే అని శ్యామ్ అంటాడు. అబద్ధం సార్ అతను తాగి నన్ను కొట్టాడు అని రుక్మిణి చెబుతుంది. కావాలంటే చూసుకోండి సార్ నేను మందు తాగలేదు అని శ్యామ్ గాలి ఊదుతాడు. అతను నిజంగానే మందు తాగలేదమ్మా కూల్ డ్రింక్ ఏ తాగాడు అని ఎస్ఐ అంటాడు. అతను కూల్ డ్రింక్స్ ఏ తాగితే మరి నన్ను ఎందుకు కొట్టాడు సార్ కర్ర ఎందుకు చేతిలో ఉంది అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights
Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights

ఆత్మరక్షణ కోసం అని చెప్పాను కదా సార్ మీకు అంత జరిగింది చెబుతాను అని రుక్మిణి ఆడిన నాటకమంతా చెప్పేస్తాడు శ్యామ్ ఎస్ఐకి. అది సార్ జరిగింది ఆస్తి కావాలంది బిడ్డనిస్తానంది కానీ ఇప్పుడు ఆస్తితో పాటు నన్ను కూడా ఇవ్వమంటుంది ఎలా కుదురుతుంది సార్ అని శ్యామ్ అంటాడు. ఏంటమ్మా నీ భర్తని ఆస్తికోసం బిడ్డను ఇవ్వనని బ్లాక్మెయిల్ చేసావా మళ్లీ ఇప్పుడు ఆస్తితోపాటు భర్త కావాలంటున్న వంట అని ఎస్ఐ రుక్మిణి అడుగుతాడు. అవును సార్ ఆస్తి తో పాటు భర్త కూడా కావాలి సమాజంలో భర్త లేని ఆడది అంటే గౌరవం ఉండదు కదా సార్ అని రుక్మిణి అంటుంది. నీకు ఏది కావాలి ఆస్తి కావాలా భర్త కావాలా రెండిట్లో ఏదో ఒకటే దక్కుతుంది అని ఎస్ఐ అంటాడు. నాకు రెండు కావాలి సార్ అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights
Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights

ఇది సార్ వరస కానీ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయికి అన్యాయం చేసి తన వెంట ఎలావెళ్ళను అని శ్యామ్ అంటాడు.మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కంప్లైంట్ రాసి ఇవ్వండి అమ్మాయిని అరెస్టు చేస్తున్నాను అని ఎస్ఐ శ్యామ్ కి చెబుతాడు. రుక్మిణిని జైల్లో వేస్తారు. శ్యామ్ కంప్లైంట్ రా సి ఎస్ ఐ కి ఇస్తాడు. సార్ నన్ను వదిలి పెట్టండి సార్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని రుక్మిణి అంటుంది. ఎలా నటించాను శ్యామ్ అని ఎస్ఐ అంటాడు. బాగా నటించావు రా ఇలాగే కంటిన్యూ చేయి రుక్మిణికి ఏ డౌట్ రాకూడదు అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, రాధా నువ్వు కూడా భోజనం చేయవా అని మధుర అడుగుతుంది. పండు వచ్చాక తింటా నా అత్తయ్య మీరు తినండి అని రాదా అంటుంది. ఇంతలో పండు వచ్చి అమ్మ ని పిలుస్తాడు. పండుని చూసినా రాధా పరిగెత్తికెళ్ళి పండు ని హగ్ చేసుకునే ముద్దులు పెడుతుంది. పండు వచ్చేసావా నాన్న ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోను అని బాధపడుతుంది రాధా. మధుర కూడా పండుని హగ్ చేసుకునే ముద్దులు పెడుతుంది .

Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights
Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights

ధనుంజయ్ కూడా పండుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. నేను చెప్పాను కదా అత్తయ్య పండుని ఆయన తీసుకొస్తారని అలాగే తీసుకొచ్చాడు అని రాదా సంతోషిస్తుంది. పండు కి రాదా అన్నం తినిపిస్తుంది.అందరి కళ్ళల్లో ఆనందం. కట్ చేస్తే, థాంక్యూ సో మచ్ సార్ పండు ని తీసుకువచ్చినందుకు అని రాధా అంటుంది.  నీకు పండు మీద ఉన్న ప్రేమను చూశాక తట్టుకోలేక పోయాను అందుకే నీకోసం తీసుకొచ్చాను పెంచిన ప్రేమ నీకు ఉంటే రక్తసంబంధమైన నాకెంత ప్రేమ ఉండాలి పండు మీద అని శ్యామ్ అంటాడు. పండు మీద నీకున్న ప్రేమ తల్లి ప్రేమ కంటే ఎక్కువ అది రాదా ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ అని శ్యామ్ అంటాడు. ఐ లవ్ యు టూ సార్ అని రాధా అంటుంది. కట్ చేస్తే ఇంతలో నాగమణి మురళి ఇంటికి వస్తారు, అమ్మ నాన్న వచ్చారు సార్ అని రాదా అంటుంది. వచ్చారా వెళ్ళు అని శ్యామ్ అంటాడు. అమ్మ నాన్న ఎప్పుడు వచ్చారు రండి ఆయన పండుని తీసుకువచ్చాడు అని రాదా సంతోషంతో చెబుతుంది.

Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights
Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights

ఏంటన్నయ్య గారు అలా ఉన్నారు ఏం జరిగింది అని మధుర అడుగుతుంది. ఏమీ లేదు రాదా రుక్మిణి పోలీస్టేషన్ లో ఉంది అని నాగమణి అంటుంది. అక్క పోలీస్ స్టేషన్ లో ఉండడమేంటమ్మా అని రాదా అంటుంది. అల్లుడు గారే పండు నీ కిడ్నాప్ చేసిందని జైల్లో పెట్టించాడమ్మా అని మురళి చెబుతాడు. అల్లుడుగారు ఆడపిల్ల జైల్లో ఉండకూడదు అలా ఉంటే మంచిది కాదు ఎలాగైనా సరే తనని వదిలిపేటు  అని మురళి అంటాడు. రాధ ఒప్పుకుంటే కేసు వాపస్ తీసుకుంటాను రాధ కోసమే నేను రుక్మిణి జైల్లో పెట్టించాను రాధ ఒప్పుకుంటే బయటికి తీసుకొస్తాను అని శ్యామ్ అంటాడు. రాధా మీ అక్క చేసింది తప్పే కాదనడం లేదు కానీ తనని వదిలిపెట్టమని చెప్పమ్మా తను జైల్లో ఉంటే తన భవిష్యత్తు పాడవుతుంది తను అలా జైల్లో ఉంటే చూడలేకపోతున్నాను అమ్మను కదా అని నాగమణి అంటుంది. ఏంట్రా శ్యామ్ నువ్వు రుక్మిణి అరెస్టు చేయించడం ఏంటి అని మధుర అడుగుతుంది. రాధా పండు కోసం పిచ్చిది అయిపోయేలా ఉందమ్మా అందుకే ఇలాంటి పని చేశాను లేదంటే ఆ రాక్షసి పండుని వదిలిపెడుతుందా వదిలిపెట్టదు అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights
Madhuranagarilo Today Episode March 14 2024 Episode 312 highlights

ఏవండీ మా అమ్మ నాన్న కోసం మా అక్కని వదిలిపెట్టండి తను తప్పుల్ని క్షమించండి అని రాదా బ్రతిమిలాడుతుంది.సరే రాధా నువ్వు చెబుతున్నావ్ కాబట్టి కేసు వాపస్ తీసుకుంటాను నీకోసం మీ అక్కని వదిలేస్తాను అని శ్యామ్ అంటాడు.  కట్ చేస్తే, శ్యామ్ వాళ్లని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. ఏంటి వీళ్లను తీసుకొచ్చావ్ వీళ్ళు రుక్మిణి బంధువుల అని ఎస్ఐ అంటాడు. తను నా భార్య వాళ్ళ తను అత్తమామలు సార్ అని శ్యామ్ వాళ్ళని పరిచయం చేస్తాడు. మా అక్క ఎక్కడ సార్ అని రాదా అడుగుతుంది. సెల్ లో ఉంది వెళ్లి చూడండి అని ఎస్ఐ అంటాడు. రాధా వాళ్ళ అమ్మానాన్న రుక్మిణి దగ్గరికి వెళ్తారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri