సూపర్‌స్టార్ మహేష్ సిల్వర్ జూబ్లీ మూవీ `మహర్షి` ఆయన కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని మహేష్ చాలా సందర్భాల్లో స్వయంగా చెప్పుకొచ్చారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తనకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మహేష్ ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడట. అందులో భాగంగా వచ్చే ఏడాది సమ్మర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. ఈలోపు మహేష్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను కంప్లీట్ చేసేస్తాడు. అయితే మహేష్, పరుశురాం కాంబినేషన్లో సినిమా మరింత ఆలస్యం అయ్యేలానే ఉంది. మరి పరుశురాం మహేష్ కోసం వెయిట్ చేస్తాడో లేక.. మరేవరైనా హీరోతో మరో సినిమా కమిట్ అవుతాడో చూడాలని సినీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!