NewsOrbit
సినిమా

Mahesh Babu: మహేష్ బాబు ఎదురుగా కనిపించినా పట్టించుకోని జనాలు.. షాక్‌లో అభిమానులు!

Mahesh Babu: ప్రిన్స్ మహేష్ బాబు తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నా తన కుటుంబంతో సరదాగా గడపడానికి కచ్చితంగా సమయం కేటాయిస్తాడు. ఏదైనా సినిమా పూర్తి చెయ్యగానే హాలిడే వెకేషన్ అంటూ కుటుంబాన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్‌కు తీసుకువెళ్లడం ఈ దూకుడు హీరోకి బాగా అలవాటు. అయితే కరోనా కారణంగా రెండేళ్ల నుంచి ఈ మహర్షి స్టార్ హాలిడే ట్రిప్స్‌కి వెళ్ళటం తగ్గించాడు. కాగా ఇటీవల సర్కారు వారి పాట సినిమాని పూర్తి చేయడంతో అతను ఈసారి హాలిడే ట్రిప్‌ని న్యూయార్క్ సిటీలో ప్లాన్ చేశాడు. ఇప్పటికే అతను తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ సిటీలో ల్యాండ్ అయి వారితో చాలా జాలిగా టైం స్పెండ్ చేస్తున్నాడు.

Mahesh Babu: న్యూయార్క్ నగరంలో మహేష్ ఫ్యామిలీ సందడి

ప్రస్తుతం మహేష్ తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారాలతో కలిసి న్యూయార్క్ సిటీని చుట్టేస్తున్నాడు. అలానే, తన హాలిడే ట్రిప్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటున్నాడు. న్యూయార్క్‌లోని మన్ హాటన్ ఫిఫ్త్ అవెన్యూలో ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సమ్మర్ నైట్స్… సిటీ లైఫ్ అంటూ మహేష్ తన సతీమణితో దిగిన ఓ బ్యూటిఫుల్ ఫొటోను షేర్ కూడా చేశాడు. ఆ ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

Mahesh Babu: వీధుల్లో ఫ్రీగా తిరుగుతున్నా పట్టించుకోని జనాలు

సాధారణంగా మన ఇండియాలో చిన్న సినీ సెలబ్రిటీ అయినా సరే బహిరంగ ప్రదేశాల్లో ఫ్రీగా తిరగలేరు. ఎందుకంటే అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు అంటూ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. నిజానికి అమెరికా వంటి ప్రముఖ దేశాల్లో కూడా మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉంటారు. వీరు తెలుగు హీరోలు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే వారిని చుట్టుముడుతుంటారు. ముఖ్యంగా న్యూయార్క్ వంటి ప్రముఖ నగరాల్లో భారతీయులు, తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. అయినా కూడా ఇక్కడ మహేష్ చాలా హాయిగా వీధుల్లో సాధారణ వ్యక్తిలా తిరుగుతూ ఎంజాయ్ చేయగలిగాడు. ఎందుకంటే చాలా రద్దీగా ఉన్నా ఈ ప్రాంతంలో ఎవరూ తనని పట్టించుకోలేదు. ఇది తెలుసుకున్న అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. మహేష్ ఏంటి ఇంత ఫ్రీగా నగరమంతా తిరిగేస్తున్నాడు? ఇదెలా సాధ్యం అని నోరెళ్లబెడుతున్నారు. ఇంకొందరు మహేష్ చాలా లక్కీ, హాలిడే ట్రిప్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేయగలుగుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. బహుషా అక్కడ తెలుగు, ఇండియా వారెవరి కంట మహేష్ పడలేదేమో… లేకపోతే సీన్ వేరేలా ఉండేదని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ సినిమా లైఫ్

ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు మహేష్‌బాబు. తన హాలిడే ట్రిప్ ని ముగించుకొని వచ్చిన తరువాత ఈ మూవీలో నటించడానికి రెడీగా ఉంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇప్పుడు తీయబోయే సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ ఒక సినిమాలో నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నిజం కాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. జక్కన్న తీయబోయే ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related posts

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri