NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili February 29 2024 Episode 585: మల్లి కి గౌతమ్ కి సమాధి కడతా అంటున్న వసుంధర, కన్నీళ్లు పెట్టుకున్న శరత్

Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights

Malli Nindu Jabili February 29 2024 Episode 585:  ఒక కూతురి సంతోషానికి కారణం అవుతున్నారు ఒక కూతురి దుఃఖానికి కారణమవుతున్నారు డాడీ ఇదేనా మీరు చూపించే తండ్రి ప్రేమ అని మాలిని అంటుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది మాలిని అని శరత్ అంటాడు. మీరు నాకెందుకు అబద్ధం చెప్పొచ్చారు డాడీ అని మలిని అంటుంది. అక్క నా ఒక్కదాని సంతోషం కోసం యాగం జరిపించే లేదు అందరూ బాగుండాలని చేపిస్తున్నాను అని మల్లి అంటుంది. దీనికంతటికి సూత్రధారివి నువ్వే కదా అని మల్లి నీ కొడుతుంది వసుంధర. వసుంధర మీదికి చెయ్ లేపుతాడు గౌతమ్. గౌతమ్ చెయ్యి పట్టుకుని ఆపుతుంది మాలిని. వసుంధర మీదికే చేయి లేపుతావా రా కొట్టరా నీ చెయ్యి నరికి నీ చేతిలో పెడతాను అని వసుంధర అంటుంది. ఇంకోసారి నా భార్య జోలికి వస్తే ఊరుకోనత ఏం చేస్తానో నాకే తెలియదు అని గౌతమ్ అంటాడు.పెద్ద వాళ్ల మీదికి చేయలేపడం సంస్కారం కాదు గౌతమ్ అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights
Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights

ఏదో మొక్కుబడిగా అడిగినట్టు అడుగుతున్నారే అని వసుంధర అంటుంది. ఏం చేయమంటావ్ వసుంధర మరి అని శరత్ అంటాడు.వాడి పెళ్ళాం మీద చేయి లేపితే వాడు చూడు నా మీదకేచేయలేపాడు నువ్వు మాత్రం నెమ్మదిగా అడుగుతున్నావ్ ఇదేనా పద్ధతి అని వసుంధర అంటుంది. అక్క ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని మల్లి అంటుంది. నా కడుపులో బిడ్డను చంపేసి నీకు బిడ్డ పుట్టాలని యాగం చేసుకుంటున్నావా నా భర్తని చంపేసి నీకు మంచి జరగాలని యాగం చేసుకుంటున్నావా నాకు మంచి చేస్తానంటూ నాకు చెడు చేస్తున్నవు మల్లి నిన్ను వదిలిపెట్టను నీ అంతు చూస్తాను అని మాలిని అంటుంది. మా కుటుంబానికి మీ అమ్మ కుటుంబానికి నీ కుటుంబానికి ఒక్కడే వారసుడు ఉండాలని ప్లాన్ చేస్తున్నావ్ కాదు మల్లి అని వసుంధర అంటుంది. నేనెందుకు అలా చేస్తానమ్మా గారు అని మల్లి అంటుంది. ఇక చేసిన గొడవ చాలు వాళ్ళని యాగం చేసుకోనివ్వండి అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights
Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights

యాగం పరిపూర్ణమయ్యే ముందు పాడు చేశారు ఇక మళ్లీ చేయకూడదు అరిష్టం బాబు అని పంతులుగారు వెళ్ళిపోతారు.ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా వసుంధర అని కౌసల్య అంటుంది.నీ కొడుకుని జైలుకు పంపించాక నాకు సంతోషం కలుగుతుంది అని వసుంధర అంటుంది. ఇంకా ఎన్నాళ్లు నా కొడుకుని అనుమానిస్తావు అని కౌసల్య అంటుంది. గౌతమ్ మాలీలకు సమాధి కట్టేదాకా వదిలిపెట్టను అంటూ వసుంధర వెళ్ళిపోతుంది. ఇదంతా నీ కారణంగానే కదా మల్లి జరిగింది నువ్వు మీ అమ్మ వాళ్ళని యాగానికి రమ్మని పిలవకపోతే ఏం పోయింది అని కౌసల్య అంటుంది. ఇంతలో శరత్ కి మీరా ఫోన్ చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో వచ్చాక అంతా వివరంగా చెప్తాను అని శరత్ వెళ్లిపోతాడు.కట్ చేస్తే, వసుంధర మాలిని ఇంటికి వస్తారు.మాలిని అక్కడికి వచ్చి అంత పెద్ద గొడవ చేయడం నాకు నచ్చలేదు అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights
Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights

మీరు మాత్రం అబద్దం చెప్పి మీరా ని తీసుకొని ఆ యాగానికి వెళ్ళొచ్చా అని వసుంధర అంటుంది. మూడు కుటుంబాలకు ఒక్కడినే వారసుని చేయాలని మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మగారు మాకు మంచి చేసే మీకు చెడు చేయాలని ఎందుకు అనుకుంటాం అని మీరా అంటుంది. మల్లి కావాలని యాగం చేసుకోలేదు నేనే చేసుకో అమ్మ యాగం చేస్తేనన్న అందరూ ప్రశాంతంగా ఉంటారు అన్నాను అందుకే మల్లి యాగానికి ఒప్పుకుంది అంతేగాని మీరు బాధలో ఉండగా తను యాగం చేసుకుని బిడ్డలను కణాలన్న ఉద్దేశం తనకి లేదు అని మీరా అంటుంది. అన్నింటికీ సూత్రధారువి నువ్వే అయి ఉండి మళ్లి ఏమీ తెలియని నంగనాచి లాగా మాట్లాడుతున్నావా అర్థమవుతుంది లే నీ మనస్తత్వం అని వసుంధర అంటుంది.ఎందుకు డాడీ నాకు అబద్ధం చెప్పి వెళ్లారు ఇదేనా ఒక కూతురి కంట్లో కన్నీళ్లు ఒక కూతురి కంట్లో ఆనందం చూస్తున్నారు  తేడా ఎందుకు డాడ్ చిన్న కూతురు అంటే ప్రేమ చూపెడుతున్నారు పెద్ద కూతురు అంటే బాధ పెడుతున్నారు తండ్రి ఇద్దరి కూతుర్లకి ఒకేలాగా ప్రేమ పంచుతాడు

Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights
Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights

అంటారు కానీ మీరు తండ్రి అనే పదానికి అనర్హులు అని మాలిని అంటుంది. ఎప్పుడూ నీ మంచి కోరే మీ డాడీని అంత మాట అంటావా అని శరత్ అంటాడు. నో డాడీ ఇదే నిజం మీరు అబద్ధం చెప్తున్నారు అంటూ మాలిని వెళ్ళిపోతుంది.శరత్ ఆ మాట విని  బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటాడు, కట్ చేస్తే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది బాధపడటం దేనికండి రండి భోజనం చేద్దురు అనే మల్లి అంటుంది. చేసేవన్నీ చేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్నావా అని కౌసల్య అంటుంది. నేనేం చేశాను అత్తయ్య అని మlli అంటుంది. మీ అమ్మ పూజ దగ్గరికి రాకపోతే ఏం పోయింది వసుంధర వాళ్లకి తెలిసి యాగాన్ని మధ్యలోనే ఆపేశారు ఇప్పుడు బాగుందా అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights
Malli Nindu Jabili Today Episode February 29 2024 Episode  585 Highlights

వసుంధర అమ్మగారు అలా చేస్తారని నేను అనుకోలేదు అని మల్లి అంటుంది. ఏం తెలియదే నీకు గౌతమ్ మీద పగతో రగిలిపోతున్నారని విషయం తెలియదా  మినిస్టర్ ధర్మారావు గారి మీద తప్పుడు ప్రచారం చేయించి మనల్ని రోడ్డు మీదకు ఈడ్చింది తను కాదా ఇంకా ఏం తెలియదని మాట్లాడుతున్నావు అని కౌసల్య అంటుంది. ఏవండీ మీరేనా నన్ను అర్థం చేసుకోండి అని మల్లి అంటుంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది మల్లి అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella