కింగ్ నాగార్జున హీరోగా రూపొందుతోన్న చిత్రం `మన్మథుడు 2`. అమ్మాయిలను అసహ్యించుకునే యువకుడి కథతో పదిహేనేళ్ల క్రితం రూపొందిన ఓ ఎంటర్టైనర్ `మన్మథుడు`కి ఇది సీక్వెల్. మరి సీక్వెల్లో యువకుడు ఎలాఉంటాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. అందులో భాగంగా ఏప్రిల్ నుండి పోర్చుగల్లో షూటింగ్ జరుగుతుంది. ఐదు వారాల పాటు జరిగిన ఈ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పోర్చుగల్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. 32 రోజులు షెడ్యూల్ను హ్యాపీగా కంప్లీట్ చేశాం అని రాహుల్ మెసేజ్ పోస్ట్ చేశారు. నాగార్జున, కిరణ్, వయాకామ్ 18 సంస్థ నిర్మాతలు.
previous post
next post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!