Meera Jasmine: గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుని ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌లో మీరా జాస్మిన్ ఒకరు. `అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి తొలిసారి అడుగు పెట్టిన ఈ కేరళ కుట్టి.. `భద్ర`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
పవన్ కళ్యాణ్, గోపీచంద్, బాలకృష్ణ, రవితేజ, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న మీరా జాస్మిన్.. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే కెరీర్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలోనే మీరా.. దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాన్‌ని 2014లో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది.
కానీ, వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు. పెళ్లైన కొన్నాళ్లకే విభేదాలు తలెత్తడంతో.. అనిల్, మీరా జాన్మిన్లు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచీ ఒంటిరిగానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే వరుస అవకాశాలను అందుకునేందుకు సోషల్ మీడియా వేదికగా ఈ భామ అందాల ఆరబోతకు తెరలేపింది. తాజాగా కూడా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో లోదుస్తులను చూపిస్తూ మత్తెక్కించే విధంగా ఫొటోలకు పోజులిచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తే ఎవ్వరికైనా మతిపోద్ది. ఎందుకంటే, అంత హాట్‌గా మీరా కనిపిస్తోంది. మరి లేటెందుకు మీరూ ఆ పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.