టాలీవుడ్ లో అక్కినేని హీరోలకు లెజండరీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు నట వారసులుగా నాగార్జున ఆయన పేరు ఘనంగా నిలబెట్టారు. మూడో తరం హీరోలుగా నాగ చైతన్య, అఖిల్ సినిమాల్లో రాణిస్తున్నారు. వీరిలో నాగ చైతన్య మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. వరుస సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాప్స్ కు అతీతంగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా చైతన్య చేసిన ఓ సినిమా యూట్యూబ్ చానెల్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది.
మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఆ సినిమానే ‘సవ్యసాచి’. మంచి అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది ఆదిత్య మూవీస్ సంస్థ. అయితే.. అనూహ్యంగా ఈ సినిమా యూట్యూబ్ వ్యూస్ భారీగా వచ్చాయి. ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుని తెలుగు సినిమాల హయ్యస్ట్ డబ్బింగ్ వెర్షన్స్ లో ఒకటిగా నిలిచింది. 719k లైక్స్ కూడా వచ్చాయి.
చెప్పాలంటే అక్కినేని హీరోల హిందీ డబ్బింగ్ మూవీస్ లో ఇదే హయ్యస్ట్ అని చెప్పాలి. నాగార్జున మూవీస్ కు కూడా మంచి డిమాండ్ ఉన్నా ఈస్థాయి వ్యూస్ ఇంతవరకూ రాలేదనే చెప్పాలి. దీంతో.. సినిమా పరంగా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీ వెర్షన్ లో ఈ సినిమా ఆకట్టుకోవడం విశేషం. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!