Niharika-Nagababu: నిహారిక కొణిదెల.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ ఈమె. హీరోయిన్గా పలు సినిమాలు, షార్ట్ ఫిల్మ్ చేసిన ఈ భామ.. 2020లో గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నటిగా కొనసాగకపోయినా.. వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ నిర్మాతగా సత్తా చాటుతోంది.
అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్‌తో తన ఫాలోవర్స్ అలరించే నిహారిక.. ఇటీవలె సడెన్‌గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీడ్ చేసింది. దీంతో ఈ విషయం గత కొద్ది రోజుల నుంచి హాట్ టాపిక్‌గా మారింది. నిహారికపై ఎన్నో రూమార్లు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ ఆమె ఏమాత్రం స్పందించడం లేదు.
అయితే తాజాగా నిహారిక తండ్రి, సీనియర్ నటుడు నాగబాబు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ `నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎందుకు డిలీట్ చేసింది?` అంటూ నాగబాబును ప్రశ్నించాడు.
అందుకు ఆయన బదిలిస్తూ.. `నిహారిక ఇన్‌స్టా అకౌంట్ డిలీట్ చేసింది నేనే. కోడింగ్ నేర్చుకొని అకౌంట్‌ను హ్యక్ చేసి డియాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను` అంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు. దీంతో నాగబాబు కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!