వయసు మీద పడుతున్నా.. తరగని అందం అక్కినేని నాగార్జున సొంతం. ఈయన నటించిన రీసెంట్ మూవీ ‘మన్మథుడు 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో.. తదుపరి చిత్రాలపై నాగ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బిగ్ బాస్ – 3తో మొన్నటి వరకు బిజీగా ఉన్న ఆయన.. తన కొత్త చిత్రానికి ఈ మధ్య కొబ్బరి కాయ కొట్టారు. చాలా సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ జరిగిపోతుందని సమాచారం. సాలమన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ‘మన్మథుడు 2’ తర్వాత చాలా ప్రాజెక్టులు వచ్చాయట.. వాటన్నింటికీ నో చెప్పిన ఆయన ఈ ప్రాజెక్టును ఒప్పుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే యోచనలో చిత్ర బృందం ఉంది. చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా పూర్తి విశేషాలు ఇప్పటి వరకు బయటపెట్టలేదు. సూపర్ కాప్‌గా నటిస్తున్నారన్న విషయం మాత్రమే తెలిసింది. త్వరలోనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!