NBK107: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు NBK107 తాత్కాలిక టైటిల్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతం సిరిసిల్ల జిల్లా లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో మరోపక్క కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. అయితే వచ్చిన ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం జరుగుతోంది. NBK107.. కన్నడ మఫ్టీ తరహా సినిమా అంటూ కాపీ అంటూ.. చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో సినిమా యూనిట్ వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ… కన్నడ సినిమాకి ఇది రీమేక్ కాదని అంటూ పుకార్లను కొట్టేసింది. NBK107 కొత్త స్టోరీ మునుపటి చిత్రాలకు ఈ సినిమాకి ఎటువంటి పొంతన లేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. మఫ్ట్టిలో హీరో శివ రాజ్ కుమార్.. స్టిల్ “NBK107” లో బాలయ్య స్టిల్ ఒకేలాగా ఉండటంతో… రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే రెండు సినిమాలు వేయండి సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో.. కనిపించనున్నారు. తండ్రీకొడుకుల పాత్రల్లో… బాలయ్య కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాలో గోపీచంద్ లక్కీ హీరోయిన్ శృతి హాసన్… నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ నెగటివ్ రోల్ లో.. యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత తిరుగులేని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న NBK107 పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!