Niharika Konidela: నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. యాంకర్‌గా, నటిగా ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. ఇక 2020 డిసెంబర్ 9న నిహారిక రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ వేదికగా జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన నిహారిక.. నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. అయితే నిహారిక వైవాహిక బంధం గురించి గత కొద్ది రోజుల నుంచీ రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జిమ్ వీడియో, పబ్ సంఘటన తర్వాత నిహారికకు, తన భర్తకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని.. విడాకులు సైతం తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఎట్టకేలకు ఈ ప్రచారంపై నిహారిక క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి లిప్ లాక్ చేసిన ఫొటోను ఆమె ఇన్‌స్టా ద్వారా అందరితోనూ పంచుకుంది. ఎప్పటికీ విడిపోని బంధం అంటూ ఆమె సదరు ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం అవాస్తమని స్పష్టంగా తేలిపోయింది.
ఇక నిహారిక షేర్ చేసి ఆ బోల్డ్ పిక్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక్క పిక్‌తో నిహారిక రూమర్లకు చెక్ పెట్టిందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మెగా ఫ్యామిలీ పరువు తీయటానికి కాకపోతే ఇలాంటి ఫొటోలు ఎందుకు షేర్ చేయడం అంటూ చురకలు అంటిస్తున్నారు. మొత్తానికి నిహారిక పిక్ మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
https://www.instagram.com/p/CdtI6SgMY8O/?utm_source=ig_web_copy_link
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!