NewsOrbit
సినిమా

NTR30: కత్తి పట్టి వ‌స్తున్నా అంటున్న తార‌క్‌.. బ‌ర్త్‌డే ట్రీట్ అదిరిందంతే!

NTR30: `ఆర్ఆర్ఆర్‌` వంటి పాన్ ఇండియా చిత్రంతో భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కొర‌టాల శివ‌తో అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, క‌ళ్యాణ్ రామ్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

`ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్‌తో త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. అయితే రేపు (మే 20) తార‌క్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఆయ‌న అభిమానుల కోసం ఎన్టీఆర్ 30 టీమ్ ఒక రోజు ముందే అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా మేక‌ర్స్ `ఎన్టీఆర్ 30` మూవీకి సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు.

`అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా..` అంటూ కత్తి ప‌ట్టి ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఈ వీడియోలో ప్ర‌ధాన అక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఎన్టీఆర్ లుక్‌ను రివిల్ చేయ‌క‌పోయినా.. బ్యాక్ గ్రౌండ్ లో సముద్రం, రక్తంతో నిండిన నీరు, పడవలు లాంటి టెరిఫిక్ విజువల్స్ ను చూపించారు.

మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. అంతేకాదు, విడుద‌లైన కాసేప‌టికే ఈ వీడియె యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. కాగా, పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ మూవీ కోసం వ‌ర్క్ చేయ‌నున్నారు. అయితే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Saranya Koduri

Naga Chaitanya: వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లు.. అయినా తండేల్ చిత్రానికి చైతు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా..?

kavya N

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

kavya N