NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam: కేర్ టేకర్ గా మళ్లీ ఎంట్రీ ఇచ్చిన భాగమతి, మనోహరి ని అమ్మ ని పిలిచిన అంజలి..

Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights

Nindu Noorella Saavasam:  మనోహరి రేపటి నుంచి ఈ భాగి ఆడబోయే ఆట ఏంటో చూస్తావు అని భాగమతి అంటుంది. కట్ చేస్తే, మనోహరి పేపర్ చదువుతూ ఉంటుంది. రాథోడ్ వచ్చి మా సార్ ని ఇంత టెన్షన్ పెట్టి నువ్వు మాత్రం సాఫీగా పేపర్ చదువుకుంటూ హ్యాపీగా కూర్చున్నావా ఉండు నీ పని చెప్తా అని పిల్లలు ఇంకా ఏం చేస్తున్నారు స్కూల్ కి లేట్ అవుతుంది త్వరగా రండి అని గట్టిగా పిలుస్తాడు. రాథోడ్ పిల్లలు పక్క ఊర్లో లేరు పైనే కదా ఉన్నారు మెల్లగా కూడా పిలవచ్చు అని మనోహరి అంటుంది. పిల్లలు కిందికి వస్తారు. పిల్లలు స్కూల్ కి లేట్ అవుతుంది ఇంకా రెడీ అవ్వలేదా అని రాథోడ్ అంటాడు. ఒకప్పుడు అంటే మిస్సమ్మ ఉంది కాబట్టి మా పనులన్నీ చేసి పెట్టేది రాథోడ్ ఇప్పుడు మాకు మేము రెడీ అవ్వాలంటే లేట్ అవుతుంది కదా ఏం చెయ్యం అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights

అంటే ఏంటి మీ ఉద్దేశం ఆ మిస్సమ్మ చేస్తుంది కానీ మనోహరి ఆంటీ చేయదని మీ ఉద్దేశం ఆ మిస్సమ్మ కన్నా మనోహరి అమ్మగారు బాగా చేస్తారు అని రాథోడ్ అంటాడు. ఆంటీ కాదు రాథోడ్ అమ్మ మా పనులన్నీ నువ్వు చేస్తావా అమ్మ అని అంజలి అంటుంది. తను ఎందుకు చేయదు బాగా చేస్తుంది అని రాథోడ్ అంటాడు. అమ్మ పెళ్లయ్యేంతవరకు  మిస్సమ్మని ఇంటికి పిలిపిద్దామా పెళ్లయిపోయిన తర్వాత పంపించేద్దాం అని అమృత అంటుంది. అమ్మగారు మిస్సమ్మ మళ్లీ వస్తుందమ్మా అని నీలా చెబుతుంది. గబగబా పరిగెత్తుకొచ్చి చూస్తారు. కట్ చేస్తే, మనోహరి కళ్ళలో కంగారు నీలా చేతులు వణుకుతున్నాయి అంటే నా చెల్లెలు బాగి వస్తుందన్నమాట అని అరుంధతి అంటుంది. భాగమతి ఎంట్రీ ఇస్తూ డాన్స్ చేస్తూ వస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights

భాగమతి తో పాటు పిల్లలు కూడా డాన్స్ చేస్తూ మనోహర్ని వెక్కిరిస్తారు. ఆపండి ఏంటి ఏదో సాధించినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు అని మనోహరి అంటుంది. మిస్సమ్మ వచ్చేసావా అని రాథోడ్ అంటాడు. అమ్మ పెళ్లయ్యేంతవరకు మిస్సమ్మని ఇక్కడే ఉండనిద్దాం అమ్మ అని అంజలి అంటుంది. శివరామ్ నిర్మల వస్తారు.ఇంతలో అమరేంద్ర వచ్చి మిస్సమ్మ ఎప్పుడొచ్చావు అని అంటాడు. పెళ్లి ఆగిపోయింది కదా సార్ ఇంట్లో ఉంటే అవే గుర్తుకొచ్చి బాధేస్తుంది అందుకే మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను అని భాగమతి అంటుంది. నీకు ఏ ఇబ్బంది అనిపించకపోతే ఈరోజే డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు అని అమరేంద్ర అంటాడు. పిల్లలు రండి మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ అమరేంద్ర వెళ్తూ మిస్సమ్మ బాయ్ అని చెప్పి వెళ్తాడు. అది చూసినా మనోహరి అమర్ బాయ్ అని అంటుంది. రా మిస్సమ్మ లోపలికి వెళ్దాం అని నిర్మల అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights

భాగమతి లోపలికి వెళ్తూ మనోహరి ఆయన చేతే పెళ్లికి ఒప్పించావు అంటే నువ్వు ఎంతటి దానివో అర్థమవుతుంది ఇక చూస్తావుగా ఈ బాగి ఆడే ఆట అంటూ వెళ్ళిపోతుంది. అమ్మగారు రాథోడ్ ఓవరాక్షన్ పిల్లల కాన్ఫిడెంట్ చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉందమ్మా వెళ్లిపోయిన మిస్సమ్మ మళ్లీ ఎందుకు వచ్చిందమ్మా అని నీలా అంటుంది. అంటే ఏంటి ఇప్పుడు ఆ బాగి నా గురించి అంతా నిజం తెలుసుకొని నా పెళ్లి ఆపడానికి వచ్చిందంటావా అని మనోహరి అంటుంది. అదే అనుకుంటామా అని నీలా అంటుంది. బాగి వచ్చి మంచి పని చేసింది లేదంటే ఆ పిల్లలకి పనులు చేస్తూ ఉండేదాన్ని ఏదైతే ఏముంది అంతా నా కంట్రోల్లో ఉంది అమర్ పెళ్లి ఒప్పుకున్నాడు అంటూ సంబరపడుతూ వెళ్ళిపోతుంది మనోహరి. ఈవిడ ఏదో పెద్ద తెలివి కలది అనుకున్నాను కానీ ఉట్టి తింగరిది అని నీలా అనుకుంటుంది. కట్ చేస్తే, మంగళ భయపడుతూ రామ్మూర్తి దగ్గరికి వచ్చి బాగి ఎక్కడికెళ్ళింది అండి అని అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights

చెప్పినా నీకు అర్థం కాదులే అని రామ్మూర్తి అంటాడు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం నయం ఏదో ఒకటి చేయాలి ఒకవేళ ఈయన పెద్ద కూతురు విషయం బయట పెడితే అని మంగళ రామ్మూర్తి దగ్గరికి వచ్చి మీ పెద్ద కూతురు విషయం ఏమైనా తెలిసిందా అండి అని అంటుంది.తెలియలేదు అని రామ్మూర్తి అంటాడు. తన గురించి తెలిస్తే ఏం చేస్తారండి అని మంగళ అడుగుతుంది. ఈ తండ్రి నిస్సహాయ స్థితికి క్షమించమని అడుగుతాను నేను ఉన్నంతకాలం తననే కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను తనకి ఏ కష్టం రాదని భరోసా ఇస్తాను అని రామ్మూర్తి అంటాడు. తను లేకపోతే అని మంగళ అంటుంది. ఎందుకే ఆ మాట అన్నావ్ చెప్పు అని రామ్మూర్తి మంగళ అని బెదిరిస్తాడు.

Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 8 2024 Episode 179 Highlights

అంటే ఇండియాలో లేకుండా ఏ అమెరికాకు వెళ్లిపోయిందేమో అని మంగళ అంటుంది. తను ఎక్కడ ఉన్నా నేను వెళ్లి వెతికి పట్టుకుంటాను నన్ను క్షమించమని అడుగుతాను అని రామ్మూర్తి అంటాడు. అది పరలోకంలో ఉంది నువ్వు కూడా చచ్చి దాని దగ్గరికి వెళ్ళు నాకు పీడ విరగడవుతుంది అని మంగళ మనసులో అనుకుంటుంది. ఈయనను నమ్ముకుంటే ఏమీ రాదు వెంటనే మనోహర్ని కలవాలి అని మంగళ అనుకుంటుంది. కట్ చేస్తే, భాగమతి బట్టలు సర్దుతూ ఉంటుంది. అరుంధతి అక్కడికి వస్తుంది. అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు అని భాగమతి అంటుంది. భాగమతికి దండం పెడుతుంది అరుంధతి. ఏంటి అక్క  నువ్వు పెద్ద దానివి నాకు దండం పెడతావ్ ఏంటి అని భాగమతి అంటుంది. నీకు అండగా నిలబడిన ఈ కుటుంబం కష్టం తీర్చడానికి వచ్చినందుకు ఆయన పెళ్లి మనోహరి తో జరగకూడదని ఆపడానికే వచ్చావు కదా అని అరుంధతి అంటుంది.. దీనితో ఈరోజే ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N