NTR: “RRR”తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ సినిమాలో తారక్ చేసిన కొమరం భీం పాత్ర చాలామందిని ఆకట్టుకుంది. సినిమా విడుదలయ్యాక ఇండియాలో రామరాజు పాత్రలో చరణ్ అద్భుతంగా నటించాడని అతనికి ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తారక్ అభిమానులు రాజమౌళి పై నెగిటివ్ కామెంట్లు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా “RRR”లో తారక్ పాత్రకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అంతేకాదు ఆస్కార్ అవార్డు గెలిచే రీతిలో కూడా.. ఇటీవల కథనాలు వస్తూ ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ మరోసారి డబల్ రోల్ లో నటించనున్నట్లు లేటెస్ట్ గా ఓ వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. తారక్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ఏడాది మే నెలలో తారక్ పుట్టిన రోజు నాడు విడుదల చేయడం జరిగింది. చాలా వైల్డ్ గా తారక్ లుక్ ఉంది. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తరహాలో స్క్రిప్ట్ నీ ప్రశాంత్ నీల్ సెట్ చేసినట్లు.. విలన్ ఇంకా హీరోగా డబల్ రోల్ లో ఎన్టీఆరే నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మరి ఇదే నిజమైతే అభిమానులకు ఫుల్ మీల్స్ అని మేకర్స్ అంటున్నారు. గతంలో “జై లవకుశ”లో ఎన్టీఆర్ డబల్ రోల్ లో కనిపించారు. “జై లవకుశ” సూపర్ డూపర్ హిట్ అయింది. మరిప్పుడు ఇదే తరహాలో ప్రశాంత్ నీల్… ఎన్టీఆర్ సినిమా స్టోరీ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాలతో చేయబోయే సినిమా కోసం ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. కొరటాల ప్రాజెక్టు అయిన వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తారక్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!