దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం `RRR`. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ సహా సముద్రఖని కూడా ఇందులో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా బల్గేరియాలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడట. నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో చరణ్ పాల్గొనడం లేదు. తదుపరి షెడ్యూల్‌ను రాజమౌళి చరణ్‌పై ప్లాన్ చేశాడట. వచ్చే ఏడాది జూలై 30న సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.
previous post