NTR: “RRR” సూపర్ డూపర్ హిట్ కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ … తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా తన కెరీర్ లో 30వ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సారధ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో “NTR 30” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరాకెక్కుతోంది. “RRR”తో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ రావడంతో కొరటాల శివ సినిమాలో పూర్తిగా తన లుక్ మార్చే పనిలో ఎన్టీఆర్ నిమగ్నమయ్యారట.
దీనిలో భాగంగా సినిమా కోసం ఏకంగా 5 కేజీలు తగ్గడానికి ఇప్పుడు ఎన్టీఆర్ వర్కౌట్స్ స్టార్ట్ చేయడం జరిగిందంట. అక్టోబర్ నెల ఆఖరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అని సమాచారం. కొరటాల తన చివరి సినిమా “ఆచార్య” అట్టర్ ప్లాప్ కావడంతో ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ విషయంలో.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో “జనతా గ్యారేజ్” సినిమా రావడం జరిగింది. అప్పట్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఆ నమ్మకంతో ఇప్పుడు తన కెరీర్ కి సంబంధించి 30వ సినిమా బాధ్యతలు తారక్ కొరటాల చేతిలో పెట్టడం జరిగిందంట. వచ్చేనెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఈలోపు.. పూర్తిగా వర్కౌట్ చేసి ఐదు కేజీలు తగ్గడానికి ఎన్టీఆర్ రెడీ అయినట్టు టాక్. గతంలో “RRR” కోసం ఎన్టీఆర్ గట్టిగాన్నే కొన్ని నెలలు జిమ్ లో వర్క్ అవుట్ లు చేశారు. కాగా ఇప్పుడు మళ్ళీ కొరటాల ప్రాజెక్ట్ కోసం రెడీ కావడం విశేషం.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!