KGF 2: “KGF 2” ఏప్రిల్ 14 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ తుఫాన్ కి మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. “కేజిఎఫ్” చాప్టర్ వన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “కేజిఎఫ్” ఫస్ట్ టైం కన్నడలో తీయగా సూపర్ డూపర్ హిట్ అయింది దాన్ని తెలుగులో ఇంకా చాలా భాషల్లో విడుదల చేయగా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడం జరిగింది.
దీంతో మొదటి పార్ట్ దృష్టిలో పెట్టుకుని… సెకండ్ పార్ట్ భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున చేపట్టడానికి రెడీ అయ్యారు. అయితే “కేజిఎఫ్ 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ రానున్నాడని సమాచారం. ఇప్పటికే సినిమా మేకర్స్ ప్రభాస్ ని కోరినట్లు.. ఓకే చెప్పినట్లు టాక్. ఏప్రిల్ నెలలో “KGF 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు వార్తలు అందుతున్నాయి.
విషయంలోకి వెళితే ప్రశాంత్ నీల్ దర్శకుడు కావటంతో పాటు ప్రభాస్ నటిస్తున్న “సలార్” కి అతడే డైరెక్టర్ కావటంతో.. డార్లింగ్ ప్రభాస్ ఫోటో ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. “KGF 2” హీరో యాష్ అదేవిధంగా ప్రభాస్ కి దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ఉండటంతో.. ఇద్దరూ ఒక స్టేజిపై ఉంటే .. మాస్ జాతరే అని తాజా వార్త పై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న “సలార్” వుడా ఏప్రిల్ 14వ తారీఖున రిలీజ్ అవుతుండటం విశేషం. దీంతో ఈ రెండు సినిమాలలో ఏది విజయం సాధిస్తుందో అన్నది సస్పెన్స్ గా నెలకొంది.
Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!