NewsOrbit
రివ్యూలు సినిమా

పేట రివ్యూ: అభిమానులకి అంకితం

సూపర్ స్టార్ అంటే ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో పేరు చెప్తారు కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాస్ సూపర్ స్టార్ ఎవరూ అంటే తక్కువ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు రజినీకాంత్… స్టైల్ కే కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రజినీకాంత్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన కబాలి’, ‘కాలా’, 2.O’ సినిమాలు కూడా పోవడంతో, తలైవా మార్కెట్ కే ఇబ్బందులు వచ్చాయి. నిజానికి రజినీ లాంటి హీరోకి మళ్లీ మార్కెట్ సెట్ చేసుకోవడానికి ఒక్క హిట్ చాలు కానీ ఆ హిట్ కోసమే రజినీకాంత్ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కష్టాల్లో ఉన్న రజినీకాంత్ ని బయటకి తీసుకురావడానికి ఒక రజినీ అభిమానే సినిమా తీస్తే ఎలా ఉంటుంది.. ఈ ఆలోచన కూడా అద్భుతంగా ఉంది. దీని నుంచి పుట్టిందే పేట సినిమా. రజినీకాంత్ కి కల్ట్ ఫ్యాన్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ తో వింటేజ్రజినీని చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించింది. ఈసారి రజినీ హిట్ కొడతాడు అనే నమ్మకం కలిగించిన పేట సినిమా సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాల మధ్యలో విడుదలయ్యింది.
ఇక ఈ సినిమా కథా కథనాల్లోకి వెళితే, డార్జ్లింగ్ లో ఒక కాలేజ్ బాయ్స్ హాస్టల్ కి కొత్త వార్డెన్ గా చేరిన కాళీ, అక్కడ జరిగే గోడవలని ఎలా అడ్డుకున్నాడు, లోకల్ రౌడీలతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది? అసలు ఒక వార్డెన్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేదే ఈ పేట చిత్ర కథ. కథనం పరంగా చూసుకుంటే సినిమా మొదటి హాఫ్ అంతా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కాళీ లైఫ్ లో ఎదో జరిగింది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ సాగింది. హీరోయిజంకి కెరాఫ్ అడ్రస్ అయిన రజినీకాంత్ ని ఎలివేట్ చేసిన విధానం అతని అభిమానులకి కచ్చితంగా నచ్చి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే వింటేజ్ రజినీకాంత్ ని గుర్తు చేశారు. ఇన్ని ఏళ్లుగా ఆయన స్టైల్ ఐకాన్ గా ఎందుకు ఉన్నాడో, ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. రజినీ ప్రతి కదలికలోను, మాట లోను అదే స్టైల్ ఇప్పటికీ ఉంది. ఇలా వేరియస్ రజినీ మార్క్ ఎలిమెంట్స్ తో ఆసక్తిని కలిగిస్తూ సాగిన ఫస్ట్ హాఫ్ ముగిసి, సెకండ్ హాఫ్ మొదలవుతుంది. పక్కా లోకల్ నేటివిటీకి తగ్గట్లు ఉండే సెకండ్ హాఫ్ అందరిని నిరాశ పరుస్తుంది, ఫ్లాష్ బ్యాక్ లో ఊహించినంత దమ్ము లేదు కానీ దుమ్ము దులిపే రజిని మాత్రం ఉన్నాడు. తన మార్క్ తోనే నడిచిన సెకండ్ హాఫ్ చాలా సేపు చూసినట్లు, బాగా ;ల్యాగ్ చేసినట్లు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా రజినీ స్టైల్ చూపించడానికి టైమ్ కేటాయించిన దర్శకుడు, కథ మొత్తం ద్వితీయ భాగంలోనే చెప్పడంతో ఆడియన్స్ కి ఈ సినిమా చాలా సేపు చూసినట్లు, సాగ దీసినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కాళీ పాత్రని అంత లేపింది ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామాని చూపించడానికా అనే ఫీలింగ్ రావడంతో సినీ అభిమానులు నిరాశ పడతారు. కథలో రజినీకాంత్ కి తప్ప ఇంకెవరికీ ఇంపార్టెన్స్ లేకపోవడంతో ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఆయన ముందు కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కాళీ పాత్రలో, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ మెప్పించింది. ఇలాంటి అండర్ కరెంట్ రోల్స్ ప్లే చేయడంలో తనకి తానే సాటని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ జెనరేషన్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న మరో హీరో విజయ్ సేతుపతి పాత్ర చెప్పుకునే అంత గొప్పది కాకపోయినా కూడా విజయ్, తన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పించాడు. ఇక మెయిన్ విలన్ పాత్రలో కనిపించిన నవాజుద్దీన్ సిద్దికీ బాషా తెలియకపోయనా పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. మెగా ఆకాష్ పర్వాలేదనిపించింది, మరో ముఖ్యమైన పాత్రలో నటించిన సనత్ కూడా బాగా నటించాడు.
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకోవాలంటే, ముఖ్యంగా… మొదటగా అనిరుద్ గురించే మాట్లాడుకోవాలి, సినిమాని.. హీరోని ఎలివేట్ చేయడంలో అతని మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. కెమెరా వర్క్ చాలా బాగుంది… ఇక రజినీ అభిమానిగా ఈ సినిమాని తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్, తనకి నచ్చిన హీరోని ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలానే చూపించాడు.. కథనం కొత్తగా చూపించడంలో దిట్ట అయిన కార్తీక్, మరోసారి ఆ మాటని నిరూపించాడు. మొదటి భాగంలో క్యూరియాసిటీని, క్లైమాక్స్ లో ట్విస్ట్ ని అద్భుతంగా ప్లే చేసిన కార్తీక్ సుబ్బరాజ్ వాడిన కలర్ ప్యాట్రన్ చాలా బాగుంది, సినిమా మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉన్న ఈ సినిమాకి కథనంలో, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని కథనం కొంచెం తగ్గించినా, రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా వెళ్లకపోయినా ఈ రోజు పేట రిజల్ట్ ఇంకో రేంజ్ లో ఉండేది. మొత్తానికి పేట సినిమా కల్ట్ రజినీ అభిమానుల కోసం, ఒక రజినీ ఫ్యాన్ తెరకెక్కించిన సినిమా. ఓన్లీ ఫ్యాన్స్ నో ఎంట్రీ ఫర్ అథర్స్

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Leave a Comment