సినిమా తారలు కేవలం సినిమా రంగానికే పరిమితం కావాలనుకోవడం లేదు. కొందరు వారి సంపాదనను సినిమా రంగంలో ఇన్వెస్ట్ చేస్తుంటే మరికొందరు సినిమాకు భిన్నమైన పలు రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ రెండో కోవలో చేరుతుంది. ఇటీవల ఈమె ఎఫ్ 45 అనే ఫిట్నెస్ సెంటర్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమె మరో రంగంలోకి అడుగు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడీ వంటి క్రీడలను అభివృద్ధి చేయడానికి దేశంలో పలు టీమ్‌లుగా విడగొట్టి వాటిని ఫ్రాంచైజీలుగా మార్చుతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ కోవలోకి టెన్నిస్ క్రీడ కూడా చేరింది. అందులో హైదరాబాద్ రాకెట్స్ అనే టీమ్‌ను రకుల్ కొనుగోలు చేసిందని టాక్.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!