RRR: మార్చి 25 వ తారీకు విడుదలైన “ఆర్ఆర్ఆర్” కలెక్షన్ ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియాలో ఐపీఎల్ టోర్నీ స్టార్ట్ అయినా గాని…”ఆర్ఆర్ఆర్” ఫీవర్ ఎక్కడా తగ్గలేదు. రిలీజ్ వీకెండ్ కలెక్షన్ ఎలా ఉన్నాయో సెకండ్ వీకెండ్.. కలెక్షన్ కూడా ఇదే తరహాలో ఉంది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ₹820 గ్రాస్…₹452 షేర్ సాధించినట్లు ఇంకా ఒక కోటి రూపాయలు బ్రేక్ ఈవెన్ కి రాబట్టాలని ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్. అయితే ఈ సినిమా సక్సెస్ విషయంలో చరణ్ ఎన్టీఆర్ పేర్లు భారీగా మారుమ్రోగుతోంది సంగతి తెలిసిందే.
ముందుగా డైరెక్టర్ రాజమౌళి టేకింగ్ కి సినీ ప్రపంచం ఫిదా అయినా గాని.. ఇద్దరు హీరోల పెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది అన్న టాక్ బలంగా వినపడుతోంది. ముఖ్యంగా రామరాజు పాత్రలో చరణ్ సెకండాఫ్ లో బ్లడ్ పెట్టేసాడు అని… , చరణ్ నటన నెక్స్ట్ లెవెల్ లోకి “ఆర్ఆర్ఆర్” ద్వారా వెళ్ళిపోవడం జరిగిందని బయట చాలా మంది సెలబ్రిటీల టాక్. అయితే సినిమా భారీగా విజయం సాధించడంతో తాజాగా రామ్ చరణ్..”ఆర్ఆర్ఆర్” టీంకి బంగారు నాణాలు పంచాడు. అంతమాత్రమే కాదు ఒక స్వీట్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఆదివారం ఉదయం “ఆర్ఆర్ఆర్” టీంకి అల్పాహారం పార్టీకి ఇంటికి ఆహ్వానించి “ఆర్ఆర్ఆర్”…కి చెందిన డైరెక్షన్, కెమెరా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ.. 10 గ్రాముల బంగారు నాణ్యం తోపాటు ఒక స్వీట్ బాక్స్.. అందించడం జరిగింది. దాదాపు 35 మంది సభ్యులకు ఈరోజు ఉదయం వాళ్ళతో మాట్లాడుతూ అల్పాహారం పార్టీ ఇచ్చి 10 గ్రాముల బంగారం కాయలు అందజేసి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించడం జరిగింది. సినిమా విజయం సాధించడంతోచరణ్ సంతోషం వ్యక్తం చేశారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!