NewsOrbit
సినిమా

మ్యూజికల్ ఫీస్ట్.. బట్ మిస్ ఫైర్డ్.. రామ్ చరణ్ ‘ఆరెంజ్’కు 10 ఏళ్లు

ram charan orange completes 10 years

ఇండస్ట్రీలో ఓ హీరో సినిమా బ్లాక్ బస్టర్ లేదా ఇండస్ట్రీ హిట్ అయితే.. తర్వాత వెంటనే వచ్చే సినిమా అదే స్థాయి అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. చిరంజీవి కూడా కొన్నిసార్లు తప్పితే దాదాపు ఆ రికార్డు మెయింటైన్ చేశారు. మరే హీరో కూడా ఇండస్ట్రీ హిట్ తర్వాత అదే స్థాయి హిట్ అందుకోలేదు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఉన్నాడు. ‘మగధీర’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమా ‘ఆరెంజ్’. ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని చూసింది. ఈ సినిమా విడుదలై నేటితో 10 ఏళ్లు పూర్తయ్యాయి.

ram charan orange completes 10 years
ram charan orange completes 10 years

నవంబర్ 26’ 2010 న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కమర్షియల్ విజయం సాధించలేదు. యూత్ బేస్డ్ కంటెంట్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ తో ఈ లవ్ స్టోరీ తెరకెక్కింది. దీనికి మన ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. కానీ.. పదేళ్లయినా ఆరెంజ్ సినిమా ప్రస్తావన వస్తే మొదట గుర్తొచ్చేది సినిమాలోని పాటల గురించే. తమిళ మ్యూజిక్ డైరక్టర్ హ్యారిస్ జైరాజ్ అందించిన సంగీతం సినిమాకు మెయిన్ ఎస్సెట్. ప్రతి పాట సూపర్ హిట్టే. పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సినిమా ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించారు. దీంతో పాటలన్నీ ఎంతో కలర్ ఫుల్ గా, ధియేటర్ ఎక్స్ పీరియన్స్ పరంగా ఎంతో  ఆకట్టుకుంటాయి.

‘మగధీర’లో హై యాక్షన్, గుర్రపుస్వారీ చేసిన చరణ్.. ఆరెంజ్ లో లవర్ బాయ్ గా కూడా ఆకట్టుకున్నాడు. అయితే.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా స్క్రీన్ ప్లే పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకునుంటే సినిమా హిట్ అయ్యేదని అభిమానులు అంటూంటారు. ఇలాంటి పాటలున్న సినిమాకు అలాంటి ఫలితం ఇప్పటికీ అర్ధం కని విషయమే. సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు. కథకు మించిన ఖర్చు, అదుపుతప్పిన ప్రొడక్షన్ ఫ్లాప్ టాక్ తో నిర్మాతగా భారీ నష్టాలను చూశారు. ఏదేమైనా.. పాటల పరంగా సినిమా ఇప్పటికీ ఓ స్వీట్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పాలి. #DecadeForCultClassicORANGE అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu