దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో వర్మ ముందు వరుసలో ఉంటారు. రీసెంట్గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. దర్శకుడిగా, గాయకుడిగా, రచయితగా, నిర్మాతగా మనకు పరిచయమే. ఇప్పుడు.. నటుడిగా కూడా పరిచయం అవుతున్నారు. గన్ షాట్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ‘కోబ్రా’ చిత్రంలో రాంగోపాల్ వర్మ నటిస్తున్నారు. అయితే ఆయన పాత్ర గురించి.. ఇతరత్రా వివరాలను తర్వాత తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ‘శత్రువును చంపడానికి త్రాచుపాముని చేరదేస్తే ఎప్పుడో ఒకప్పుడు అది మనల్ని కూడా కాటేస్తుంది’ అనే ట్యాగ్ లైన్ పోస్టర్లో కనపడుతుంది. అలాగే వీడిని అరెస్ట్ చేస్తే సగం పోలీస్ డిపార్ట్మెంట్ జైల్లోకెళ్తుంది అనే మాటలు కూడా పోస్టర్లో కనపడుతున్నాయి.
previous post
next post