Kushi: వరుస పరాజయాలతో ఉన్న సమంత, విజయ్ దేవరకొండ కి “ఖుషి” సినిమా మంచి బ్రేక్ ఇవ్వటం తెలిసిందే. ప్రేమ కథ నేపథ్యంలో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా… అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. ఈ సినిమాలో సమంత ఇంకా విజయ్ దేవరకొండ లుక్స్ ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ గా అనిపించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సింపుల్ లవ్ స్టోరీ తో లవ్ అండ్ ఎఫెక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు ఇంకా కామెడీని పండించి క్లైమాక్స్ లో ప్రేక్షకులను మెప్పించే రీతిలో.. శివ నిర్వాణ అద్భుతంగా స్టోరీని నడిపించారు. ముఖ్యంగా సినిమా మ్యూజిక్ ఇంకా పాటలు ఎంతగానో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల అవ్వకముందే పాటలకి మంచి ఆదరణ లభించాయి.
దీంతో మొదటి నుండి పాజిటివ్ టాక్ దిశగా సాగిన ఖుషి విడుదలైన తర్వాత కూడా అదే రీతిలో అందరి హృదయాలను గెలుచుకుంది. దీంతో ఖుషి సినిమాకి భారీ ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ కెరియర్ లో అత్యంత హైఎస్ట్… కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు కూడా సృష్టించింది. ముఖ్యంగా సినిమాలో సమంత విజయ్ దేవరకొండ ల మధ్య సీన్స్.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సమంత మరోసారి తన మార్క్ నటనతో.. ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. కానీ కొన్ని సన్నివేశాలలో గ్లామర్ పరంగా నటన పరంగా సమంత కంటే విజయ్ దేవరకొండ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పవచ్చు.
కానీ సినిమాలో సమంత విజయ్.. సమంతలా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.. చాలా హైలైట్ అయ్యాయి. అయితే ఈ సన్నివేశాల విషయంలో విజయ్ దేవరకొండ… బెస్ట్ ఫ్రెండ్ రష్మిక..కి మైండ్ బ్లాక్ అయిందట. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ సినిమాలో పండిందని.. సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ తో డిస్కషన్ చేయడం జరిగిందంట. గతంలో నటించిన గీతాగోవిందం కంటే.. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య మంచి రొమాంటిక్ ఇంకా లవ్ ట్రాక్ నడిచిందని ప్రశంసించిందట. ఏది ఏమైనా చాలాకాలం తర్వాత విజయ్ దేవరకొండ కి హిట్ సినిమా పడటంతో రష్మిక కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!