Rashmika Mandanna: “పుష్ప” సినిమాతో నేషనల్ క్రష్ హీరోయిన్ గా రష్మిక మందన చలామణి అవుతుంది. కనడాకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేశాక తలరాత మారిపోయింది. “చలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ “గీతాగోవిందం” సినిమాతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకు ఎవరు” సినిమా ఛాన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” రష్మిక మందన.. క్రేజ్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేసింది.
“పుష్ప” విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అమితాబచ్చన్ తో ఓ సినిమా కూడా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేసే అవకాశం ఒకానొక టైంలో రావడం జరిగింది అంట. మేటర్ లోకి వెళ్తే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” సినిమాలో నివేదా థామస్ నటించిన పాత్రలో.. ముందుగా రష్మిక మందననీ అనుకున్నారట. అయితే అప్పుడే స్టార్ హీరోయిన్ గా పేరు రావడంతో రష్మిక ఈ అవకాశం వదులుకోవటం జరిగిందట.
సినిమా మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ కావడంతో ఇలాంటి పాత్రలు చేస్తే గ్లామర్ డ్యూటీ గా ఇండస్ట్రీలో.. రాణించలేమని.. పవన్ సినిమాని రిజెక్ట్ చేసినట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మిక మందన పుష్ప సెకండ్ పార్ట్ లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్ మరియు సౌత్ ఫిలిం సినిమాలు చేస్తూ ఉంది. ప్రజెంట్ మాత్రం మాఫింగ్ వీడియో వివాదం రష్మిక మందన చుట్టూ తిరుగుతూ ఉంది. రష్మిక ముఖం మార్చేసి.. చాలా అసభ్యకరంగా కొత్త టెక్నాలజీతో ఎడిట్ చేసిన ఈ వీడియో పట్ల రష్మిక చాలా బాధపడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అయింది. సినీ రాజకీయ ప్రముఖుల సైతం సీరియస్ అవుతూ ఉన్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!