RGV: ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. రూ. 12 కోట్లు బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్ల వసూలు చేసి దాదాపు రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన ఆకృత్యాలను ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీ ప్రధాని మోదీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు చేయడం కొసమెరుపు.
RGV: ఎన్నడూ లేని విధంగా వెరైటీగా కుక్కతో రామ్ గోపాల్ వర్మ..!!
RGV: వర్మ థియరీ:
ఇటీవలే ఈ మూవీ విషయంలో ప్రశంసలు కురిపించిన ఆర్జీవి తాజాగా మరోసారి కశ్మీర్ ఫైల్స్‌ను ఉద్దేశిస్తూ బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’బాలీవుడ్ చరిత్రను మార్చేసింది. బాలీవుడ్‌కు చెందిన 7 బడా ప్రొడక్షన్ హౌజ్‌లు టాప్‌లో ఉండటానికి పోటీపడుతూ ఉంటాయి. కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు ఎప్పుడు ఎలా వచ్చి టాప్ చైర్లో కూర్చుంటాయో చెప్పలేం. ది కాశ్మీర్ ఫైల్స్ కిల్లర్ విజయం బాలీవుడ్లో ఉన్న అపోహలను చేరిపేసింది’అంటూ వర్మ రాసుకొచ్చారు.
RGV: రాంగోపాల్ వర్మ గురించి సింగల్ స్టేట్మెంట్ ఇచ్చిన యాంకర్ శ్యామల.. వర్మ అభిమానులు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారో?
ఆ విషయాలు మీకోసం:
– హిట్ సాధించాలంటే పెద్ద స్టార్లు కావాలి అని బాలీవుడ్ అపోహ పడుతుంది, కానీ కాశ్మీర్ ఫైల్స్‌లో స్టార్లు లేకపోవడమే కాదు, సినిమా డిసైడింగ్ స్టార్‌ను కూడా కలిగి లేకపోవడాన్ని గమనించాలి.
– హిట్ సాధించడానికి మీకు మెగా బడ్జెట్లు అవసరం, కానీ కాశ్మీర్ ఫైల్స్ చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిందనే విషయం తెలిసినదే.
– హిట్ కావాలంటే మీకు సూపర్ హిట్ పాటలు కావాలి, కానీ కాశ్మీర్ ఫైల్స్ లో ఒక్క థీమ్ తప్ప మరేమీ లేదు.
– హిట్ చేయడానికి మీకు మసాలా కావాలి. కాశ్మీర్ ఫైల్స్‌లో మీరు ఒక్కసారి కూడా నవ్వలేరు.
– హిట్ చేయడానికి మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి, కానీ మూవీకి ముందు నిర్మాత గురించి ఎవరు పెద్దగా విని ఉండరు అనేది సత్యం.
– మీకు సినిమా హిట్ చేయడానికి అనేక కోట్ల ప్రమోషన్స్ కావాలి, కానీ రాధే శ్యామ్ 25 కోట్లతో పోలిస్తే కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు కేవలం 2.5 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడం గమనార్హం.
– ప్రేక్షకులు లాజిక్స్ లేని సినిమాలే చూస్తారని అనుకోవద్దు.. ప్రేక్షకులు తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గుర్తించారు.
– ఛార్ట్ బస్టర్ పాటలను చూపించాల్సి ఉంటుందని అనుకుంటారు.. కానీ కాశ్మీర్ ఫైల్స్‌లో ఎటువంటి ప్రయత్నం లేదు. హమ్ దేఖేంగే అనే బ్యాక్ గ్రౌండ్ థీమ్ మాత్రమే ఉంటుంది. ఇలా చాలా పాయింట్స్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ లో చేశాడు.. ఓ లుక్కేయండి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!