Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి కూడా. ఇప్పటికే వందలాది చిన్నాలను ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించి వారి పాలిట ఆపద్భాందవుడిగా నిలుస్తున్న మహేష్.. మరెన్నో సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నాడు.
ఇక తాజాగా మహేష్ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. చిన్నారుల హృదయ స్పందన కోసం తన ఎంబీ ఫౌండేషన్, హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ల సంయుక్త సహకారంతో `ప్యూర్ లిటిల్ హార్ట్స్` ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ విషయాన్ని నిన్న మీడియా ముఖంగా తెలియజేసిన మహేష్.. లోగో కూడా ఆవిష్కరించారు.
అయితే మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయానికి నగరి ఎమ్మెల్యే, సీనియర్ నటి రోజా ఎంతగానో సంతోషించారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ కార్యక్రమంలో మహేష్ మాట్లాడుతున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రోజా.. `చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేష్‌కి హ్యాట్సాఫ్` అని పొగడ్తల వర్షం కురిపించింది.
దీంతో ఈమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషాన్ని పట్టలేక ఉబ్బితబ్బిపోతున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ మూవీ, రాజమౌళితో ఓ మూవీ మహేష్ చేయనున్నాడు.
❤️చిన్నారుల గుండె చప్పుడు వింటున్న @urstrulyMahesh హ్యాట్సాఫ్. 🙏🙏🙏 pic.twitter.com/OwXtyz33GD
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 6, 2022
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!