RRR: “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి చోట సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ హైలెట్ గా ఉన్నట్లు చరణ్ పెర్ఫార్మెన్స్ కూడా చించేసినట్లు చూస్తున్న జనాలు చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్.. ఇంటర్వెల్ టైం లో వచ్చే ఫైట్ మరియు క్లైమాక్స్ ఫైట్ సినిమా మొత్తానికి హైలెట్ గా చిత్రీకరించారని.. ఆ మూడు ఫైట్లు చూడటానికి కనీసం పదిసార్లు అయినా థియేటర్లకు వెళ్లొచ్చు అని సినిమా చుసిన ఆడియాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం “ఆర్ఆర్ఆర్” కి టికెట్ ధరలు పెంచుకోవటం మాత్రమే కాకుండా స్పెషల్ షో లకు కూడా కొన్ని రోజులపాటు పర్మిషన్ ఇవ్వడం తెలిసిందే.
దీంతో ఇప్పుడు సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో “ఆర్ఆర్ఆర్” టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి వెన్నెముక నైజాం లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి నట్లు పవన్ కళ్యాణ్ “బీమ్లా నాయక్” మూవీ రికార్డు బ్రేక్ చేసినట్లు లేటెస్ట్ టాక్ బయట వినబడుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే “బీమ్లా నాయక్” నైజాం ఏరియాలోనే అత్యధిక షేర్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించగా తాజాగా “ఆర్ఆర్ఆర్” ఆ రికార్డు బ్రేక్ చేసిన ట్లు.. వార్తలు వస్తున్నాయి.
“బీమ్లా నాయక్” ఓపెనింగ్ రోజు నైజామ్ ఏరియాలో రూ 11.80 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” 24 కోట్లు రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉందని మేటర్ లోకి వెళ్తే స్పెషల్ షో లకు మరియు అదనపు ఐదవ షోకి.. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రికార్డు స్థాయి కలెక్షన్లు మొదటి రోజు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పైగా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో… వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదని చెప్పుకొస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల కష్టానికి రికార్డు స్థాయి రిజల్ట్ వచ్చిందని గ్యారెంటీగా బాహుబలి రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చూసిన జనాలు అంటున్నారు.