Samantha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ `ఆర్ఆర్ఆర్` అనే భారీ మల్టీస్టారర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా కంటే ముందే అలియా భట్ `గంగూభాయ్ కతియావాడి`తో ప్రేక్షకులను పలకరించింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై సంజయ్ లీలా భన్సాలీ, జయంతిలాల్ గడా నిర్మించారు. భారీ అంచనాల నడుము ఫిబ్రవరి విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా వేశ్య పాత్రను పోషించిన అలియా భట్.. తన నటనతో మెస్మరైజ్ చేసింది.
వేశ్యలు మాట్లాడే భాష, బాడీ లాంగ్వేజ్‌తో ఆమె అదరగొట్టేయడంతో.. నెటిజన్లే కాదు సినీ ప్రముఖులు సైతం అలియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా అలియా భట్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ఇన్‌స్టా స్టోరీ పెట్టింది.
`గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం. అలియా మీ నటన గురించి వివరించడానికి మాటలు సరిపోవడం లేదు. ప్రతీ ఒక్క డైలాగ్.. హావాభావాలు.. నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి` అంటూ తన ఇన్ స్టా స్టోరీలో సామ్ రాసుకొచ్చింది. దీంతో ఈమె పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!