Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. 2017లో నాగచైతన్యత పెళ్లి ఆ తర్వాత 2021 లో విడాకులతో… సమంత కెరియర్ ఎత్తు పల్లాల గుండా వెళ్ళింది. అయితే 2022లో ఆరోగ్యపరంగా మయోసైటీస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరమైంది. దాదాపు ఆరు నెలలకు పైగానే ఈ వ్యాధిని జయించడానికి సమంత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అనంతరం గత ఏడాది ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసింది. ఆ సమయంలో వరుసపరాజయాలతో ఉండగా “ఖుషి” సినిమాతో విజయాన్ని… అందుకోవటం జరిగింది.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైన “ఖుషి” తర్వాత సమంత ఇప్పటి వరకు మరో సినిమా కంఫర్మ్ చేయలేదు. కానీ చారిటీ పరంగా ఇంకా రకరకాలుగా అభిమానులకు సామ్ దగ్గరవుతోంది. కొద్దిరోజుల క్రితం బ్యానర్ కూడా స్థాపించింది. “ఖుషి” సినిమా విజయం తర్వాత.. దాదాపు మూడు నెలల పాటు విదేశాలలో రిలాక్స్ కావడం జరిగింది. ఆ సమయంలో మాయోసైటీస్ కి సంబంధించి మిగిలిన చికిత్స తీసుకోవడం జరిగింది. ఈ వ్యాధి బారిన పడిన సమయంలో ట్రీట్మెంట్ కారణంగా గ్లామర్ దెబ్బ తినడం జరిగింది. అయినా గాని తర్వాత కొద్దిగా కోలుకొని ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసింది. అయితే ఫుల్ గ్లామర్ తో పాటు మంచి హెల్తీ లైఫ్ టేకప్ చేసుకోవడానికి గత ఏడాది విదేశాలలో కొన్ని ప్రత్యేకమైన స్థలాలలో గడిపి చికిత్స పొందుకోంది.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సమంత మరో సినిమా చేయడానికి కథలు వింటుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా తమిళనాడులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆడియన్స్ లో ఒకరు నటనలో ఎవరు స్ఫూర్తి అని ప్రశ్నించారు. దానికి సమంత… అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చారు. ఆయనతో మరోసారి నటించాలని ఉందని పేర్కొన్నారు. దీనికి కారణం బన్నీ యాక్టింగ్ బీస్ట్ గా అవతరించటం. ఈ వీడియోని బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సమంత అల్లు అర్జున్ తో కలిసి “సన్నాఫ్ సత్యమూర్తి” అనే సినిమా చేసింది. “పుష్ప” సినిమాలో ఐటెం సాంగ్ లో బన్నీతో పాటు స్టెప్పులు వేసింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!