మన టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధాన్ని కూడా కొందరు నిలబెట్టుకోవడం లేదు. ఆరు లేదా ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్న వారు పెళ్లయిన అనంతరం ఒక్క సంవత్సరం కూడా కలిసి ఉండటం లేదు. ఈ కోవా కి చెందిన వారే సమంత మరియు నాగచైతన్య. వీరిద్దరూ ” ఏ మాయ చేసావే ” సినిమా సమయంలో ప్రేమలో పడ్డారట. ఇక అనంతరం ఆరేళ్ల పాటు వీరిద్దరి ప్రేమాయణం బాగానే నడిచింది. ఇక అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు కూడా.
ఇక దీంతో అంతా బాగానే ఉంది అనే సమయానికి విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. ఇక దీంతో వీరిద్దరి అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం వీరు ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. అయినప్పటికీ వీరిపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. చైతు పక్కన సమంత అయితేనే చాలా బాగుంటుంది. సమంత ప్లేస్ ని నాగచైతన్య లైఫ్ లో ఎవ్వరు రీప్లేస్ చేయలేరని చెప్పొచ్చు.
ఇక తాజాగా నాగచైతన్య లైఫ్ లో సమంత ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ దొరికేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చైతన్య మూవీస్ పెద్దగా హిట్ అవడం లేదు. గతంలో సమంత మరియు నాగచైతన్య కలిసి నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక అదేవిధంగా నాగచైతన్య మరియు సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా మంచి వసూళ్లను కూడా రాబడతాయి.
ఒకప్పుడు సమంత మరియు నాగచైతన్యాలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రస్తుతం సాయి పల్లవి, నాగచైతన్యాలకి అంతటి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే నాగచైతన్య లైఫ్ లో సమంత ప్లేస్ ని సాయి పల్లవి రీప్లేస్ చేసిందంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వార్తలపై కొందరు స్పందిస్తూ..” నాగచైతన్య మరియు సమంతాల మేటర్ పక్కన పెడితే సాయి పల్లవి మాత్రం అలాంటిది కాదు. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో పద్ధతిగా కొనసాగుతుంది. ఇంకెప్పుడు వీళ్ళిద్దరికీ రిలేషన్ కలప వద్దు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు సాయి పల్లవి అభిమానులు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!