`అర్జున్‌రెడ్డి` దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి మాతృవియోగం జరిగింది. సందీప్ రెడ్డి తల్లి వంగా సుజాత గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వరంగల్ మరీ వెంకటయ్య కాలనీలోని స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `అర్జున్ రెడ్డి`తో దర్శకనిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు సందీప్ రెడ్డి. ఇటీవల బాలీవుడ్లో `కబీర్ సింగ్` చిత్రానికి దర్శకత్వం వహించారు సందీప్. ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.
previous post
next post