Shankar Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ అదేవిధంగా రాజమండ్రి ఇంకా పంజాబ్ రాష్ట్రాలలో… కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. “RRR” సూపర్ డూపర్ హిట్ కావడంతో నార్త్ లో రామ్ చరణ్ కి సపరేట్ మార్కెట్ క్రియేట్ కావడంతో… ఈ సినిమాని ఇప్పుడు హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేసే ఆలోచనలో శంకర్ మరియు నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే సినిమాలో చరణ్.. మూడు డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు మొదటి నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నట్లు సినిమా ప్రాజెక్టు మొదలు కాకముందే ఈ వార్త బయటకు వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ ప్రాజెక్టునీ ఓ సూపర్ స్టార్ వదులుకున్నట్టు లేటెస్ట్ టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది. విషయంలోకి వెళితే ఈ సినిమాలో మినిస్టర్ క్యారెక్టర్ మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి చేత చేయించాలని.. శంకర్ డిసైడ్ అయ్యారట. మమ్ముట్టితో కూడా సినిమా మొదలు అవకముందు చర్చించగా.. ఆయన నో చెప్పినట్లు దీంతో ఆ క్యారెక్టర్ ఇప్పుడు.. మరో సీనియర్ యాక్టర్ చేత చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మమ్ముట్టి తెలుగులో ఇప్పటికే “జనతా గ్యారేజ్”.. ఇంకా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. శంకర్ కి సంబంధించి కీలక ప్రాజెక్టులో… అవకాశం వచ్చినా గానీ ఆ పాత్ర తనకు సరిగ్గా నచ్చనట్లు.. దాంతో వదులు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే శంకర్.. తాను తెరకెక్కించే సినిమాలకు చాలా టైం తీసుకుంటారని ముందు అనుకున్న బడ్జెట్ కంటే చివరాకరికి.. మరింత పెంచేస్తారన్న…టాక్ మొదటి నుండి ఇండస్ట్రీలో ఉంది. ఈ క్రమంలో సినిమాను అనుకున్న టయానికి చెప్పిన బడ్జెట్లోనే.. ముగించే విధంగా దిల్ రాజు అగ్గ్రిమెంట్ తీసుకోవడం జరిగిందట. సో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా.. చేయిస్తున్నట్లు అనుకున్న సమయం కంటే ముందుగానే విడుదల చేసే రీతిలో.. నిర్మాత దిల్ రాజు అన్నట్లు వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!