NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

Tamil Nadu: The Family Man-2: తమిళులు పట్టు పడితే అంతే..! ఫ్యామిలీ మ్యాన్2 పరిస్థితేంటో..!?

tamil nadu people angry

Tamil Nadu: The Family Man-2: ది ఫ్యామిలీ మ్యాన్-2 Tamil Nadu: The Family Man-2 వెబ్ సిరీస్ తొలి భాగం సూపర్ హిట్టయింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో భాగం తెరకెక్కించారు దర్శక ద్వయం రాజ్ నిడుమోరు. కృష్ణ డీకే. ఈ వెబ్ సిరీస్ రెండో భాగంలో స్టార్ హీరోయిన్ సమంత ఉగ్రవాదిగా నటించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తమిళ ఈలం సభ్యుల్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించడంపై తమిళనాడు ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ‘తమిళనాడులో సామరస్యత దెబ్బ తినకుండా ఉండాలంటే వెబ్ సిరీస్ రిలీజ్ ను అడ్డుకోండి’ అంటై రాష్ట్ర ఐటీ మంత్రి మనో తంగరాజ్.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు లేఖ రాశారు. ప్రస్తుత కరోనా సమయంలో కూడా ది ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్ కాక రేపుతోంది.

tamil nadu people angry
tamil nadu people angry

శ్రీలంకలో తమిళులకు జరుగుతున్న అన్యాయం, వివక్షపై పుట్టిందే ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం). వేలుపిళ్లై ప్రభాకరన్ నాయకత్వంలో శ్రీలంక సైన్యానికి ధీటుగా ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేశాడు. శ్రీలంక ప్రభుత్వానికి నిద్రలేకుండా పెద్ద గెరిల్లా యుద్ధమే నడిపాడు. ఉత్తర, తూర్పు శ్రీలంకలో తమిళ రాజ్యం ఏర్పాటే లక్ష్యంగా పోరాటం చేశాడు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు సూత్రధారి కూడా ప్రభాకరనే. అయినా.. తమిళులకు ప్రభాకరన్ హీరో. దశాబ్దాల అంతర్యుద్ధం తర్వాత 2009లో ప్రభాకరన్ తో జరిపిన యుద్ధంలో అతని కుటుంబసభ్యులతో సహా దారుణంగా హతమార్చింది సైన్యం. అక్కడితో ప్రభాకరన్ పోరాటం ముగిసింది. శ్రీలంకలో తమిళుల హక్కులను కాపాడటమే ధ్యేయంగా అతను నడిపిన పోరాటం తమిళులకు గర్వకారణం.

Read More: Samantha: The Family man2: ఫ్యామిలీ మేన్-2.. సమంత మాయ చేస్తుంది కానీ తప్పు చేస్తుందా?

ఇప్పుడు అదే తమిళ ఈలంను సమంతతో చేయించి ఉగ్రవాదిగా చూపించమే ప్రస్తుత వివాదానికి కారణమైంది. తమిళ హక్కుల కోసం పోరాటం చేసే తమిళ ఈలం సభ్యులను ఉగ్రవాదిగా చూపించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి ఒక అంచనాకు రావొద్దని దర్శకులు రాజ్, డీకే, హీరో మనోజ్ బాజ్ పేయి అంటున్నారు. తమిళ సంప్రదయం, సంస్కృతికి ఎక్కడా భంగం కలగకుండా.. వారి గౌరవాన్ని పెంచేలా సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నారు. కానీ.. తమిళుల పట్టిన పట్టు వీడరు. హిందీ జాతీయ భాష ప్రకటనపై తమిళుల్లో వచ్చిన వ్యతిరేకతకు ప్రధానే వచ్చి తమిళనాడులో ప్రకటన చేసేలా చేశారు. మరి.. ఈసారేం జరుగుతుందో చూడాలి.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu