Toxic: KGF సినిమాలతో యష్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోవడం జరిగింది. అంతకుముందు కన్నడ ఇండస్ట్రీలో.. కొన్ని సినిమాలు చేసిన గాని చిన్నపాటి హీరోగా కర్ణాటక రాష్ట్రానికి మనోడు ఇమేజ్ పరిమితమై ఉండేది. కానీ కేజీఎఫ్ సినిమాలతో ఇండియా వ్యాప్తంగా యాష్.. తిరుగులేని స్టార్ హీరో ఇమేజ్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా కేజిఎఫ్ సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ₹1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తన తర్వాత సినిమా కన్ఫామ్ చేయటానికి దాదాపు ఏడాదిన్నరకు పైగానే యష్ సమయం తీసుకోవడం జరిగింది. యష్ కెరియర్ లో .. 19వ సినిమాగా కొద్ది రోజుల క్రితం టైటిల్ డిసెంబర్ 8వ తారీకు ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో చెప్పినట్టుగానే డిసెంబర్ 8వ తారీకు.. తన తదుపరి సినిమా టైటిల్ ప్రకటించారు. లేడీ దర్శకురాలు గేతు మోహన్ దాస్ దర్శకత్వంలో “టాక్సిక్” అనే సినిమా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాకి క్యాప్షన్ గా “ఏ పైరి టైల్.. ఫర్ గ్రొన్ అప్స్”.. పెట్టడం జరిగింది. ఏ సినిమాని కె వి ఎం ప్రొడక్షన్స్ మాస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చేతిలో గన్.. నోట్లో సిగరెట్.. తలపై హాట్..తో యష్ లుక్.. చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. 2025 ఏప్రిల్ 10వ తారీఖు ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా చేయడం జరిగింది. “టాక్సిక్” మొదటి ఇంట్రడక్షన్ ప్రకటన వీడియో చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
“కేజిఎఫ్” రికార్డ్స్ బ్రేక్ అవుతాయని మరి కొంతమంది అంటున్నారు. ఆ తరహా లోనే ఈ సినిమాలో కూడా.. యష్ లుక్ కనిపిస్తోంది. సిగరెట్ తాగుతూ.. చాలా స్టైలిష్ గా వీడియోలో యాష్ కనిపించడం జరిగింది. “టాక్సిక్” టైటిల్ ప్రకటనకు ముందు “కేజిఎఫ్”.. సినిమాకి మించి అభిమానులను అలరించడానికి స్టోరీ సెలక్షన్ విషయంలో టైం తీసుకున్నట్లు యాష్ తెలియజేశారు. ఇప్పుడు ఆతరహాలోనే టైటిల్ ఉండటంతో.. “టాక్సిక్” సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ట్రాక్ అప్ ది టౌన్ గా మారింది.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!