Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో విజయవంతంగా థియేటర్ లో సందడి చేస్తూ ఉంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ప్రభాస్ సినిమా హిట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. 2023 సంవత్సరంలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా “సలార్” నిలిచింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ “సలార్” లో ప్రభాస్ నీ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. యాక్షన్ డ్రామాలో హీరోకి సంబంధించిన ఎలివేషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ బాడీ మరియు స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా ఉంది. సలార్ మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో చాలామంది తెలుగు ప్రముఖ హీరోలు నిఖిల్ ఇంకా చిరంజీవి మరి కొంతమంది ప్రభాస్ ని అభినందించారు.
ప్రశాంత్ నీల్ అంతకుముందు తీసిన “KGF” సినిమాల కంటే “సలార్”… చాలా బాగుందని చెబుతున్నారు. దీంతో షారుక్ ఖాన్ నటించిన “డంకీ” సినిమా కూడా.. “సలార్” సినిమా హవాకి తట్టుకోలేకపోయింది. ఒకరోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు విడుదల కాగా “సలార్” సినిమాయే పై చేయి సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై పాయల్ గోష్ నెగటివ్ కామెంట్లు చేయడం జరిగింది. సలార్ సినిమా చాలా చెత్తగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఒక్కసారి మాత్రమే కాదు జవాన్, పఠాన్, యానిమల్ మూడు సినిమాలు బాగాలేదని.. నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది. ఈ సినిమాలో జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయి. షారుక్ కొత్త సినిమా “డంకీ” కూడా బాగోలేదని కామెంట్ పెట్టింది. డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీ కెరియర్ మొత్తంలో “డంకీ” సినిమాయే అతిపెద్ద ఫ్లాప్ అని పోస్ట్ పెట్టింది.
అయితే పాయల్ ఘోష్ కామెంట్లు పట్ల నెటిజన్స్ రియాక్ట్ అయ్యి… కావాలని వార్తల్లో నిలవడానికి ఇలాంటి పోస్టులు పెడుతున్నట్లు కౌంటర్లు వేస్తున్నారు. వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఇండియన్ బౌలర్ షమ్మీ ప్రముఖంగా వార్తల్లో నిలవడంతో అతని పెళ్లి చేసుకుంటానని అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రకంగానే మీడియా అటెన్షన్ తనవైపు ఉండాలని సలార్ సినిమా పట్ల పాయల్ ఘోష్ వ్యాఖ్యలు చేసినట్లు.. ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా “సలార్” మొదటి రోజు ₹178.7కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ₹117 కోట్ల వసూలు చేసినట్లు మేకర్స్ తెలియజేయడం జరిగింది. ఓవరాల్ గా “సలార్” వెయ్యి కోట్లకు పైగానే కలెక్ట్ చేసే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!