NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Extra Ordinary Man First Review: నితిన్.. శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమా రివ్యూ..!!

Extra Ordinary Man First Review: నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ డిసెంబర్ 8వ తారీకు విడుదలయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. కామెడీ నేపథ్యంలో యాక్షన్ ఓరియెంటెడ్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా రివ్యూ తెలుసుకుందాం.

పరిచయం:

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో “జయం” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ స్టార్టింగ్ లోనే మంచి గుర్తింపు పొందారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించిన సై సినిమాతో యూత్ ని ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. సై బ్లాక్ బస్టర్ విజయం తర్వాత.. నితిన్ వరుస పరాజయాలు ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేసిన గాని ఎక్కడా కూడా.. ఆశించిన విజయం రాలేదు. అలాంటి సమయంలో “ఇష్క్” అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత వరుస విజయాలు అందుకోగా మళ్లీ ఇటీవల కొద్ది కాలం నుండి.. నితిన్ కి ఫ్లాప్ లు పడ్డాయి. ఈ క్రమంలో విజయమే లక్ష్యంగా.. తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. టీజర్ మరియు ట్రైలర్ వినోదబరితంగా ఉండటంతో.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో డిసెంబర్ 8వ తారీకు విడుదలైన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’.. ఎలా ఉందో తెలుసుకుందాం.

Review of the movie Extra Ordinary Man starring Nitin and Srileela as hero and heroine

స్టోరీ:

అభయ్(నితిన్) చిన్నప్పటి నుంచి వేరే వ్యక్తుల లాగా నటించటం చాలా ఇష్టం. ఆ రకంగా తన టాలెంట్ చూపించి సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా రాణిస్తాడు. జీవితం ఇలా ఆడుతూ పాడుతూ తనకు ఇష్టమైన సినిమా రంగంలో ఆకాశం రావటంతో మంచి నటుడిగా పేరు సంపాదించడానికి చాలా కష్టపడతాడు. అయితే అభి ఎంత కష్టపడుతున్నా గాని.. టెక్నీషియన్ సుదర్శకులు సినిమాలో అతడు కనబడకుండా.. కెమెరాకు అందనంత దూరంగా ఉంచుతారు. దీంతో అభి.. ఎంతో బాధ పడిపోతుంటాడు. అలాంటి సమయంలో అతనికి లిఖిత(శ్రీలీల) పరిచయమవుతుంది. లిఖిత చాలా ధనవంతురాలు. లిఖితతో పరిచయం ఏర్పడిన తర్వాత అభి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అదే జీవితం పూర్తిగా మారిపోతుంది. లిఖిత కంపెనీలో సీఈఓ స్థాయికి ఎదుగుతాడు. అటువంటి పరిస్థితులలో అభికి ఓ సినిమాలో హీరో ఛాన్స్ వస్తుంది. సినిమా రంగం ఎన్నో కష్టాలు పడి బయటకు వచ్చాక రెండు లక్షల జీతంతో… జీవితం చాలా సాఫీగా సాగుతున్న సమయంలో హీరోగా ఛాన్స్ రావడంతో అభి ఎటువైపు వెళ్ళాలో అర్థం కాదు. అయినా గాని సినిమాపై మక్కువతో.. లక్షల్లో జీతం వదులుకొని.. సినిమా చేయడానికి రెడీ అవుతాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కావటంతో..అభికీ విపరీతంగా నచ్చుద్ది. యదార్థ సంఘటన ఆధారంగా కథ రాసుకున్నట్లు దర్శకుడు చెబుతాడు. అయితే అభినీ హీరో చేస్తానంటూ.. ఆశ పెట్టిన వ్యక్తి మోసం చేయడం జరుగుద్ది. ఆ మోసం వల్ల ఆంధ్ర మరియు ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుకు పోలీస్ ఆఫీసర్ గా వెళ్లడం జరుగుద్ది. సినిమా హీరోగా తాను విన్న కథలో విలన్ పాత్ర కలిగిన నిజమైన వ్యక్తితో పోరాటానికి కోటియా గ్రామంలో అది అడుగు పెట్టడం జరుగుద్ది. ఈ క్రమంలో ఆ గ్రామ ప్రజలను విలన్ భారీ నుంచి రక్షించేందుకు.. అభి ఏం చేశారు..? ఐజి విజయ్ చక్రవర్తి(రాజశేఖర్)..అభి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? అభి ఇంతకీ నిజమైన పోలీసా..? కాదా..?.. కంటివి తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.

Review of the movie Extra Ordinary Man starring Nitin and Srileela as hero and heroine

విశ్లేషణ:

జూనియర్ ఆర్టిస్ట్ గా అభి పాత్రలో నితిన్ ఇట్టే ఒదిగిపోయాడు. ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్వించారు. లిఖిత పాత్రలో శ్రీలీల.. తన మేరకు న్యాయం చేయడం జరిగింది. కానీ కథలో హీరోయిన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఎంటర్టైన్మెంట్ లక్ష్యంగా తీసిన ఈ చిత్రంలో.. కామెడీ ట్రాకులు పుష్కలంగా ఉన్నాయి. కానీ స్టోరీలో పెద్దగా దమ్ము లేదు. దీంతో సినిమా సాగే తీరుకు.. వచ్చే కామెడీకి పొంతన లేకుండా ఉంటది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమా స్టోరీలు తెలుగులో చాలానే వచ్చాయి అని ఫీల్ కలుగుద్ది. సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ రాణించాలని కష్టపడే సన్నివేశాలు ఇంట్లో తండ్రి తింటే తిట్లు.. సరదాగా ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ట్రెండింగ్ అంశాలను కూడా.. కామెడీ ట్రాక్ లో చూపించారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో.. సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలిగేలా చేస్తాయి. పోలీస్ ఉన్నతాధికారిగా రాజశేఖర్ పరిచయ సన్నివేశాలు.. యాక్షన్ ఎపిసోడ్.. చూడటానికి బాగుంటాయి. ఇదే సమయంలో రాజశేఖర్ మరియు నితిన్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. గబ్బర్ సింగ్ తరహాలో.. పోలీస్ స్టేషన్ లో నితిన్ తన గ్యాంగ్ తో అల్లరి నవ్వులు సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్టు హింట్ ఇచ్చే రీతిలో ముగించారు.

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri