NewsOrbit
Featured సినిమా

Thaman: థమన్ బీట్స్ కు బ్రేకుల్లేవ్..! పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ లో స్పెషల్

thaman proving with music again and again

Thaman: థమన్ Thaman పవన్ కల్యాణ్ ‘వకీల్‌ సాబ్’‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లో స్టడీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. యూఎస్ లో కూడా మంచి కలెక్షన్లే రాబడుతోంది. కరోనా మలి విజృంభణ, ఏపీలో టికెట్ రేట్ల విషయంలో అలజడి లేకుంటే కలెక్షన్ల ఫిగర్ ఇంకా ఎక్కువగా ఉండేది. అయినా.. ఇవేవీ వకీల్ సాబ్ ప్రభంజనాన్ని అడ్డుకోలేదు.

సాఫ్ట్ గా ఉండే ఒరిజినల్ పింక్ సినిమాను కమర్షియలైజ్డ్ గా మలచి దర్శకుడు వేణు శ్రీరామ్ మంచి మార్కులు కొట్టేశాడు. పవన్-ప్రకాశ్ రాజ్ నటన, కథనం పవన్ మాసివ్ లుక్ అన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే.. అందరి నోటా వినిపిస్తున్న మరో పేరు థమన్. ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ గురించ ప్రతిఒక్కరూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

thaman proving with music again and again
thaman proving with music again and again

ఎస్ఎస్ థమన్ కు 2008లో కిక్ తర్వాత అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోయింది. ఎంతగా అంటే.. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 50 సినిమాలు పూర్తి చేసేశాడు. టాలీవుడ్ లో థమన్ పేరు మోగిపోయింది. మణిశర్మ కాస్త తగ్గడం.. దేవిశ్రీ ప్రసాద్ పుంజుకోవడంతో థమన్ ప్రాభవం తగ్గిపోయింది. కాపీ కంటెంట్ ముద్రతోపాటు రిపీట్ మ్యూజిక్ అంటూ ఆఫర్లు తగ్గాయి. థమన్ కూడా ఆకట్టుకోలేక పోయాడు. ఈ సమయంలో 2018 థమన్ కు కమ్ బ్యాక్ ఇయర్ అయింది. ఆ ఏడాది వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’, ‘అరవింద సమేత..’ కు థమన్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అనుష్క భాగమతికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ సినిమాకు ప్లస్ అయింది.

2020లో బన్నీ అల.. వైకుంఠపురములో సినిమాకు థమన్ ఇచ్చిన పాటలు ఏస్థాయిలో హిట్ అయ్యాయో తెలిసిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ తో థమన్ పేరు మోగిపోతోంది. మగువా.. మగువా.. పాట ఓ సంచలనం. పాటలతోనే సినిమాపై హైప్ పెంచేసిన థమన్ బ్యాక్ గ్రౌండ్ తో మ్యాజిక్కే చేశాడు. మహేశ్ కూడా తన ట్వీట్ లో థమన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. దీంతో ఇక థమన్ కు కొన్నేళ్లపాటు తిరుగులేదనే వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్-శంకర్ సినిమాకు కూడా థమన్ సంగీతం అనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో థమన్ కు వరుస ఆఫర్లున్నాయి. ఇదే హవా కంటిన్యూ చేస్తే థమన్ కు ఇప్పట్లో తిరుగులేనట్టే.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N