Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల బయట ప్రపంచానికి బాగా కనెక్ట్ అవుతూ ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురైన అనంతరం.. సమంత ఎంతో తల్లడిల్లిపోయింది. 2011లో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సమంత అతి తక్కువ కాలంలోనే.. అగ్ర హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ తో పాటు తమిళ సినిమా రంగంలో స్టార్ హీరోలు అందరి సరసన నటించడం జరిగింది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్, విజయ్ దేవరకొండ ఇంకా చాలామంది హీరోలతో.. నటించడం జరిగింది. 2017లో నాగచైతన్యతో వివాహం కావడంతో సినిమాలు విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.
ఆ రకంగా కెరియర్ సాగుతుండగా ఊహించని విధంగా 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తరువాత ఏడది మయో సైటీస్ వ్యాధి బారినపడి.. నరకం అనుభవించింది. సమంత మళ్ళీ కోలుకోవాలని ఆ సమయంలో చాలామంది అభిమానులు ఇంకా తోటి నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు ధైర్యం చెప్పారు. అయితే అనూహ్యంగా ఎనిమిది నెలల పూర్తిగా కోలుకున్న సమంత… మళ్లీ సినిమా రంగంలో యధావిధిగా రాణించటం జరిగింది. గత ఏడాది “ఖుషి” విజయంతో హిట్టు ట్రాక్ ఎక్కిన సమంత తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుంది. ఇప్పటికీ మరో సినిమా కన్ఫామ్ చేయలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలు తెలియజేస్తుంది. ఇదే సమయంలో… కొత్త నిర్మాణ ప్రొడక్షన్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అంతేకాకుండా తాను అనారోగ్యానికి గురైన సమయంలో ఏ రకంగా జీవితాన్ని కంట్రోల్ చేయటంతో పాటు బాధను ఎలా అధిగమించమని విషయాలను టేక్ 20 పాడ్ కాస్ట్ ద్వారా తెలియజేస్తూ ఉంది. ఇదే సమయంలో పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మయోసైటీస్ వ్యాధి గురైన సమయంలో ఎదుర్కొన్న సమస్యలను సమంత వివరించింది. ఆ సమయంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు తెలిపింది. “మయోసైటిస్ కారణంగా సినిమాలు చేయలేకపోయానని.. అదే తన జీవితంలో కఠిన నిర్ణయమని స్టార్ హీరోయిన్ సమంత తెలిపారు. ఆరోగ్యం సహకరించకే తన వృత్తిని కొనసాగించలేకపోయానని చెప్పారు. ’13 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా. ఈ జర్నీలో కోపం, ఆత్మన్యూనతకు లోనయ్యా. నాలోని అభద్రతా భావాలు తెలుసుకున్నా. వీటన్నింటినీ అధిగమించి నన్ను నేను మలుచుకున్నా. నా కష్టసుఖాల్లో అండగా నిలిచే అభిమానులకు రుణపడి ఉంటా” అని సమంత తెలిపింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!