Niharika: ప్రస్తుత కాలంలో నిహారిక పేరు సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రెండ్ అవుతుందో మనందరికీ తెలిసిందే. నిత్యం ఏదో సాకుతో ఈమెని ట్రోల్స్ కి గురి చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఎన్నో ఊహలతో పెళ్లి చేసుకున్న ఈమె ఏడాది పాటు కూడా కలిసి కొనసాగలేక పోయింది. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం లైఫ్ మనం అనుకున్నట్టు ఉండదని.. అడ్జస్ట్ అయితేనే బ్రతక గలమని… ఎన్నో ఊహలతో పెళ్లి చేసుకున్న నేను ఇలా అవుతుందని అనుకోలేదని.. పేర్కొంది ఈ ముద్దుగుమ్మ.
ఇక వీటిపై ఇటీవలే జొన్నలగడ్డ చైతన్య సైతం రియాక్ట్ అయ్యి యాంకర్ పై ఫైర్ అయ్యాడు. విడాకులు విషయంలో నిజానిజాలు తెలుసుకోవాలని పేర్కొన్నాడు. ఇక నిహారిక మాట్లాడుతూ..” విడాకులు తీసుకున్న తర్వాత నేను సింగల్ గా నేను. నేను మా అమ్మ, నాన్నలతో ఉన్నాను. మా అన్న, వదిన తో కూడా ఉన్న. నాకు ఎల్లప్పుడూ మా అమ్మ, నాన్న సపోర్ట్ గా నిలిచారు.
నేను సింగిల్ అని అనుకోవడం లేదు. నేను త్వరలోనే మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ కూడా చెబుతా..” అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” గుడ్ న్యూస్ అంటే మరో పెళ్లి చేసుకోబోతున్నావా? నువ్వు కూడా శ్రీజ లాగా తయారవుతున్నావు. పెళ్లంటే మీకు ఆట లాగా ఉంది ” అంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!